English   

ఓటీటీతో సినిమా చనిపోతుందన్నాడు..ఇప్పుడు ఆయనే ప్లాన్ చేస్తున్నాడు 

Suresh Babu
2020-07-23 13:05:01

ఈ మధ్యకాలంలో సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్‌ సొంతంగా అంటే ఒక్కరే కాకుండా మరో బ్యానర్ ను కలుపుకుని సినిమాలు నిర్మిస్తోంది. అది కాక మంచి కంటెంట్‌తో వెరీ ఎవరైనా సినిమా తెరకెక్కిస్తే ఈ సినిమా రైట్స్ కొనుక్కొని మరి రిలీజ్ చేస్తున్నాడు సురేష్ బాబు. తాజాగా తన తమ్ముడు వెంకటేష్, మేనల్లుడు నాగచైతన్య హీరోలుగా ‘వెంకీ మామ’ సినిమాను తెరకెక్కించాడు. అయితే ఈ సినిమా రిలీజ్ కి కొన్ని రోజుల ముందు మీడియాతో మాట్లాడుతూ ఓటిటి ప్లాట్‌ఫాంలు థియేట్రికల్ వ్యాపారాన్ని చంపుతున్నాయని, చాలా థియేటర్లు వీటి వలన మూసేసే పరిస్థితి ఉందని చెప్పి ఒక రేంజ్ చెప్పడం వలన వెంకీ మామను అమెజాన్ ప్రైమ్ వంటి వాటికి అమ్మకపోవచ్చని అందరూ ఊహించారు. కానీ వెంకీ మామా యొక్క టైటిల్ కార్డులలో అమెజాన్ ప్రైమ్ స్ట్రీమింగ్ భాగస్వామి అని తెరపై కనిపించినప్పుడు అందరూ షాక్ అయ్యారు.

 సురేష్ బాబు తన సినిమాను అమెజాన్ ప్రైమ్ వీడియోకు ఎలా అమ్మారో తెలియక అందరూ షాక్ కి గురి అయ్యారు. ఆ తరువాత ఓటీటీ వేదికలు ఇండస్ట్రీని తినేస్తాయన్నంత మాత్రాన అవి ఉండకూడదనేది నా ఉద్ధేశం కాదని థియేటర్లకు రప్పించేలా సినిమాలు తీయాలి. అమెజాన్ కి అమ్ముకునేలా కంటెంట్ ఉండాలి! అంటూ ఆయన అప్పట్లో కామెంట్ చేశారు. అయితే కొత్తగా ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌ను ప్రారంభించేందుకు నిర్మాతలు ఆసక్తిని కనబరుస్తున్న క్రమంలో సురేష్‌బాబు పేరు చాలాకాలంగా వినిపిస్తోంది. ఓటీటీకి సరిపోయే సినిమాలు, వెబ్‌సిరీస్‌లను మాత్రమే నిర్మిస్తానని, తను డిజిటల్‌ ప్లాట్‌ఫామ్‌ను ప్రారంభించే ప్రసక్తి లేదని గతంలో ఆయన ప్రకటించారు. అయితే ఇప్పుడు సురేష్‌బాబు తన ఆలోచనను మార్చుకున్నట్లు తెలిసింది.  ఓటీటీకి అవసరమైన వనరులన్నీ సిద్ధంగా ఉండటంతో  సురేష్‌బాబు సొంతంగా ఓ డిజిటల్‌ ప్లాట్‌ఫామ్‌ను ప్రారంభించే యోచనలో ఉన్నట్లు చెబుతున్నారు సన్నిహితులు. చూడాలి మరి ఏమవుతుందో ?

More Related Stories