English   

పెళ్ళికి జోరుగా ఏర్పాట్లు...ఇద్దరు సీఎంలకు ఆహ్వానం 

Rana Daggubati Miheeka
2020-07-23 13:10:12

అదేంటో కానీ మామూలు రోజుల్లో కంటే ఈ లాక్‌డౌన్ టైంలోనే టాలీవుడ్ లో ఎక్కువ పెళ్ళిళ్ళు అయ్యాయి. అసలు ఊహించను కూడా ఊహించకుండా లాక్ డౌన్ లో తన ప్రేయసి యస్ చెప్పిందని చెప్పి షాక్ ఇచ్చాడు రానా. రానా - మిహీకాల ఫ్యామిలీ ఇటీవ‌ల త‌న పెళ్ళి ముహూర్తాన్ని కూడా ఫిక్స్ చేసుకున్నారని అంటున్నారు. ఆగ‌స్ట్ 8న వీరి వివాహం జ‌ర‌గ‌నున్నట్టు దగ్గుబాటి ఫ్యామిలీ వర్గాల నుండి తెలుస్తోంది. వీరి వివాహ వేదిక‌కి సంబంధించిన వార్త ఒకటి టాలీవుడ్‌ లో బాగా హ‌ల్‌చ‌ల్ చేసింది. అదేటంటే వీరి కుటుంబ స్టేటస్ కు తగ్గట్టే వీరి పెళ్లిని ఫలక్‌నుమా ప్యాలెస్ లో కుటుంబ స‌భ్యులు, స్నేహితుల స‌మ‌క్షంలో జరపనున్నట్టు చెబుతున్నారు. ఇటీవ‌లే రామానాయుడు స్టూడియోలో రానా, మిహీకాల రోకా వేడుకని కుటుంబ స‌భ్యుల మ‌ధ్య సంద‌డిగా జ‌రుపుకున్నారు. 

అయితే షూటింగ్స్ మొదలయిన నేపధ్యంలో స్టూడియోలో అంత సేఫ్ కాదని భావించి పెళ్లి ప్యాలెస్ లో ప్లాన్ చేశారని కూడా టాక్ ఉంది. ప్రస్తుతానికి అయితే పెళ్ళికి 50 మంది హాజరు కావడానికే ఛాన్స్ ఉంది. తెలుగు, మార్వాడీ సాంప్రదాయాల్లో  ఈ పెళ్లి నిర్వహించనున్నారని తెలుస్తోంది. అయితే తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఇద్దరినీ పెళ్లికి ఆహ్వానించాలనుకుంటున్నారని తెలుస్తోంది. త్వరలో రానా సురేష్ బాబులు ఇద్దరూ స్వయంగా ఇరు రాష్ట్రాల సీఎంలను కలిసి ఆహ్వాన పత్రికలను అందించనున్నారని తెలుస్తోంది. రానా సినిమాల విష‌యానికి వ‌స్తే ఆయన త్వర‌లో అర‌ణ్య అనే సినిమాతో ప్రేక్ష‌కుల‌ని ప‌ల‌క‌రించనున్నాడు. లాక్ డౌన్ లేకుంటే అది రిలీజ్ ఇప్పటికే కావాల్సి ఉంది. ఇక ఆయన వేణు ఉడుగుల డైరెక్షన్ లో విరాటపర్వం అనే పీరియాడిక్ మూవీ చేస్తున్నాడు.

More Related Stories