English   

నయనతార చేస్తే తప్పు కాదు.. నేను చేస్తే మాత్రం తప్పు వచ్చిందా..

Vanitha Vijaya kumar
2020-07-23 21:47:01

తమిళనాట ప్రస్తుతం వనిత విజయకుమార్ పెళ్లి గురించి చాలా చర్చ జరుగుతుంది. జూన్ 27న ఈమె పెళ్లి జరిగింది. తమిళ దర్శకుడు పీటర్ పాల్ ను ఈమె మూడో పెళ్లి చేసుకుంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు వనిత పెళ్లిపై రోజుకొక వార్త సోషల్ మీడియాలో రచ్చ చేస్తూనే ఉంది. మరీ ముఖ్యంగా తమిళనాట కొందరు సినీ ప్రముఖులు ఈమె పెళ్లిని విమర్శిస్తున్నారు. ఈ విమర్శలపై వనిత కూడా తీవ్ర స్థాయిలో విరుచుకుపడింది. నా గురించి మాట్లాడే ముందు మీ గురించి మీరు తెలుసుకోండి.. మీరు ఏమైనా పతివ్రతలా అంటూ రెచ్చిపోయింది. పీటర్ పాల్ తన మొదటి భార్యకు విడాకులు ఇవ్వకుండానే రెండో పెళ్లి చేసుకున్నాడు అంటూ సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. ఇదే విషయంపై పాల్ మొదటి భార్య కూడా కోర్టును ఆశ్రయించింది. ఇదిలా ఉంటే తాజాగా తన వివాదంలోకి నయనతారను కూడా తీసుకొచ్చింది వనిత విజయ్ కుమార్. 

ఇక్కడ సంబంధం లేకపోయినా కూడా నయనతార వ్యక్తిగత జీవితాన్ని ప్రస్తావించింది. అప్పట్లో ప్రభుదేవా కూడా తన భార్యకు విడాకులు ఇవ్వకుండానే నయనతారతో సహజీవనం చేశాడని ఆమె గుర్తు చేసింది. దీంతో ప్రభుదేవా భార్య రమాలతతో పాటు ఆమె ముగ్గురు పిల్లలు ఎన్నో కష్టాలు అనుభవించారని చెప్పుకొచ్చింది. అప్పట్లో ఈ విషయంపై ఒక్కరు కూడా నోరు మెదపలేదని.. కానీ ఇప్పుడు న్యాయబద్ధంగా తాను చేసుకున్న మూడో పెళ్లి గురించి మాత్రం ఎందుకు మాట్లాడుతున్నారని ఆమె సూటిగా ప్రశ్నించింది. దీంతో ఆమెపై నయనతార ఫ్యాన్స్‌ పెద్ద ఎత్తున వనితపై మండిపడ్డారు. ఈ విమర్శలను భరించలేక వనిత చివరకు తన ట్విట్టర్ ఖాతాను తాత్కాలికంగా మూసివేసింది. మరి ఈ వ్యవహారం ఇంకా ఎంత దూరం వెళుతుందో చూడాలి. 

More Related Stories