కరోనా టైంలో బయట తిరుగుతున్న తమన్నా..

బయటకు వెళ్తే కరోనా వైరస్ తోడుగా వస్తుందిప్పుడు. అందుకే ఎవరూ అడుగు బయట పెట్టకుండా ఇంటికి పరిమితం అయిపోయారు. అత్యవసరం అనుకుంటే తప్ప అడుగు బయట పెట్టడం లేదు సామాన్య జనం కూడా. బంగ్లాలో ఉండే అమితాబ్ బచ్చన్ కుటుంబాన్నే కరోనా వైరస్ వదిలిపెట్టలేదు. అలాంటిది ప్రతి చిన్న విషయానికి బయటికి వస్తే కరోనా కాటేయకుండా ఉంటుందా. అందుకే అందరూ ఇళ్లకు ప్రభుత్వ అయిపోయారు. ఇలాంటి సమయంలో తమన్నా మాత్రం బయటకు వెళ్లింది. లాక్ డౌన్ ఎన్ని రోజులు కుటుంబసభ్యులతో హాయిగా గడిపిన ఈ ముద్దుగుమ్మ.. ఇప్పుడు మాత్రం తనకు ఇష్టమైన ప్రపంచానికి వెళ్ళింది. ఎలాగూ షూటింగ్స్ మళ్లీ మొదలైతే బిజీ లైఫ్ వస్తుంది. అందుకే ఆ లోపు తాను చేయాలనుకున్న పనులు పూర్తి చేస్తుంది తమన్నా.
తాజాగా ప్రకృతి అందాలను ఆస్వాదించే పనిలో పడింది. థానేలో ప్రముఖ పర్యాటక స్థలం అసంగావ్ మహులి పోర్టును సందర్శించింది మిల్కీ బ్యూటీ. పోర్టు పరిసర ప్రాంతాలను కాలినడకన అధిరోహించింది. అటవీ ప్రాంతంలో ట్రెక్కింగ్ చేస్తున్నపుడు దిగిన ఫొటోను ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ ఫోటో వైరల్ అవుతుంది. ఇదిలా ఉంటే తెలుగులో గోపీచంద్ సరసన సిటీ మార్ సినిమాలో నటిస్తుంది తమన్నా.