English   

వర్మ మీద దాడి ఘటనలో కొత్త ట్విస్ట్

RGV
2020-07-24 18:28:21

రామ్ గోపాల్ వర్మ కార్యాలయం దాడి కేసులో కొత్త ట్విస్ట్ చోటు చేసుకుంది. నిజానికి “పవర్ స్టార్” అనే టైటిల్ తో రామ్ గోపాల్ వర్మ సినిమా చేయడమే కాక దమ్ముంటే తన ఆఫీస్ కి రమ్మని సవాల్ విసరడంతో పవన్ కళ్యాణ్ అభిమానులు ఆర్జీవి కార్యాలయానికి వెళ్లి కూర్చున్నారు. దీంతో వర్మ ఆఫీస్ సిబ్బంది తమ ఆఫీస్ మీద దాడి చేశారు అంటూ కంప్లైంట్ ఇవ్వటంతో వారిని అరెస్టు చేయటం ఆ వార్త నిన్న తెలుగు మీడియా సర్కిల్ వైరల్ కావడంతో ఆర్జీవి వర్సెస్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అన్నట్టు పరిస్థితి మారిపోయింది. ఆర్జీవి కార్యాలయం సిబ్బంది తో పోలీసులు ఎనిమిది మందిని అరెస్టు కూడా చేశారు.

అయితే మళ్ళీ ఏమయిందో ఏమో కానీ దాడికి పాల్పడిన వారిపై ఇచ్చిన ఫిర్యాదును ఉపసంహరించుకున్న వర్మ కార్యాలయం. ఫిర్యాదును వెనక్కి తీసుకోవడంతో దాడికి పాల్పడిన ని వదిలి పెట్టారు జూబ్లీహిల్స్ పోలీసులు. అరెస్ట్ అయిన వారు ఓయూ జేఏసీ నేతలని చెబుతున్నారు. కాగా ఈ దాడి గురించి రామ్ గోపాల్ వర్మ అని మీడియా ప్రశ్నించగా ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్ అభిమానులు కరోనా టైం లో తనకు మేలు చేశారని… తాను తీస్తున్న “పవర్ స్టార్” సినిమా టైటిల్ కి ఫ్రీ పబ్లిసిటీ ఇస్తున్నారని చెప్పుకొచ్చారు.  

More Related Stories