English   

రిలీజయిన నాలుగేళ్ళకి బుల్లితెర మీదకి 

Vikram I telugu
2020-07-24 18:39:42

దక్షిణాదిన ఉన్న టాలెంటెడ్ యాక్టర్ లలో చియాన్ విక్రమ్ ఒకరు. ఉత్తరాదిన అమీర్ ఖాన్ ఎలా సినిమా సినిమాకి ఆ పాత్రలోకి పరకాయ ప్రవేశం చేసి నటిస్తారో దక్షిణాదిన విక్రమ్ కూడా అంతే. అలా ఆయన ఒక సినిమాలో రకరకాల పాత్రలు చేసిన సినిమాలు అపరిచితుడు, మల్లన్న, ఐ, ఇంకొక్కడు వంటివి ఉన్నాయి. అయితే శంకర్- విక్రమ్ లు కలిసి చేసిన ఐ సినిమా భారీ అంచనాల మధ్య రిలీజ్ అయింది. 2015 సంక్రాంతి సమయంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘ఐ’ చిత్రం వసూళ్ల పరంగా నిరాశ పర్చింది. అమీ జాక్సన్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమా కలెక్షన్స్ మొదటి వారంలో ఒక మోస్తరుగా నమోదవ్వడంతో తెలుగు - తమిళంలో ఈ సినిమా మూవీగా నిలిచింది. అయితే ఈ సినిమా విడుదలై నాలుగేళ్ళవుతున్నా ఇప్పటి వరకు టెలివిజన్ లో ఈ సినిమా టెలికాస్ట్ కాలేదు. ఎట్టకేలకు స్టార్ మా తెలుగు వర్షన్ ‘ఐ’ ని ప్రసారంకు చేయడానికి రెడీ అయ్యింది. ఈ సినిమాను ఏకంగా అయిదు కోట్ల రూపాయలకు గాను స్టార్ మా ఛానెల్ తెలుగు డబ్బింగ్ రైట్స్ ను దక్కించుకుందని అంటున్నారు. ఈ ఆదివారం ఈ సినిమా ప్రసారం కానున్నట్టు చెబుతున్నారు.

More Related Stories