ఆసక్తికర పాత్రలో సూర్య ఫస్ట్ లుక్ విడుదల

తమిళంలో విలక్షణ దర్శకుడిగా పేరు తెచ్చుకున్న వెట్రిమారన్ దర్శకత్వంలో హీరో సూర్య నటిస్తున్న సినిమా ’వాడివాసల్‘. తమిళనాడు ప్రజలు సెంటిమెంట్ గా ఫీల్ అయ్యే జల్లికట్టు క్రీడా నేపథ్యంలో ఈ సినిమాను వెట్రిమారన్ రూపొందిస్తున్నట్టు సమాచారం. తెలుగులో కూడా సూర్యకు మంచి గుర్తింపు ఉన్న నేపధ్యంలో హీరో సూర్య సినిమాలు తమిళంతో పాటు తెలుగులోను ఏకకాలంలో విడుదల అవుతూ ఉంటాయి. ఈ సినిమాలో సూర్య తండ్రీకొడుకులుగా అంటే ద్విపాత్రాభినయం చేస్తున్నట్టు కోలీవుడ్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి.
ఇక కరోనా మహమ్మారి వల్ల ఈ ప్రాజెక్టు ఆలస్యమవుతోంది. అతడితో ప్రకాష్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి కలైపులి ఎస్ థాను నిర్మిస్తున్నారు. జల్లికట్టులో తన తండ్రి ప్రాణాలు తీసిన ఒక ఎద్దును మచ్చిక చేసుకునే కొడుకు గా సూర్య కనిపిస్తారని అంటున్నారు. ఇక ఈ సినిమా 2021 ప్రారంభంలో సెట్స్ కెళ్లనుందని తెలుస్తోంది. నిన్న సూర్య జన్మదినాన్ని పురస్కరించుకొని చిత్రబృందం ఫస్ట్‌లుక్ విడుదలచేసింది. సీఎస్ చెల్లప్ప రాసిన నవల ఆధారంగా రూపొందుతున్న ఈ సినిమాలో హీరోయిన్ ఎవరనేది ఇంకా తేలాల్సి ఉంది.