English   

నితిన్ పెళ్లికొడుకు వేడుకలో పవన్ కళ్యాణ్..

Nithiin
2020-07-24 19:11:42

టాలీవుడ్ హీరోల్లో నితిన్ అంటే పవన్ కళ్యాణ్‌కు ఎందుకో తెలియని ఇష్టం. మరోవైపు పవన్ అంటే నితిన్‌కు అభిమానం కాదు పిచ్చి. హద్దులు దాటిన ఈ ప్రేమ గురించి చెప్పడానికి ఆయన దగ్గర మాటలు కూడా లేవు. మెగా కుటుంబం కాకపోయినా కూడా నితిన్‌ను సొంత తమ్ముడిగా ట్రీట్ చేస్తుంటాడు పవర్ స్టార్. ఈ ఇద్దరి మధ్య ఉన్న రిలేషన్ కూడా అంత బలంగా ఉంటుంది. అలాంటి నితిన్ ఇప్పుడు పెళ్లి కొడుకు అవుతున్నాడు. జులై 26న ఈయన షాలినిని పెళ్లి చేసుకోబోతున్నాడు. ఎప్పుడో ఎప్రిల్‌లోనే జరగాల్సిన పెళ్లి కాస్తా కరోనా కారణంగా ఇప్పటి వరకు వాయిదా పడుతూ వచ్చింది. ఇప్పుడు పెళ్లి కొడుకు ఫంక్షన్ జరిగింది. దీనికి పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్, చినబాబు ముగ్గురు హాజరయ్యారు. ముఖ్యంగా అందులో పవన్ గెటప్ చూసి అంతా షాక్ అయ్యారు. అభిమానులు కూడా అదే షాక్‌లో ఉన్నారు. పవన్ ఏంటి ఇలా మారిపోయాడు అంటూ వాళ్లు కూడా పరేషాన్ అవుతున్నారు. ఏదేమైనా కూడా ప్రస్తుతం నితిన్ పెళ్లి కొడుకు ఫంక్షన్ ఫోటోలు మాత్రం వైరల్ అవుతున్నాయి. 

More Related Stories