English   

మన్మథుడు హీరోయిన్ అన్షు ఇప్పుడేమి చేస్తోందో తెలుసా ..

 Manmadhudu
2020-07-25 13:10:05

టాలీవుడ్‌లో అప్పటివరకూ యువసామ్రాట్ గా ఉన్న నాగార్జునని ‘మన్మథుడి’గా మార్చేసింది 2002లో విజయ్ భాస్కర్ దర్శకత్వంలో వచ్చిన మన్మథుడు సినిమా. ఈ చిత్రానికి 17 ఏళ్ల తరువాత సీక్వెల్ వచ్చినా అది పెద్దగా వర్కౌట్ కాలేదు. ఇక మన్మధుడు సినిమాను ఎవరూ మరిచిపోలేరు. ఎందుకంటే నాగ్ కెరీర్‌లోనే పెద్ద హిట్ గా నిలిచింది ఈ సినిమా. మన్మథుడు సినిమా ఇప్పుడు చూసినా ఆ సినిమా చూసినంత సేపు బోర్ కొట్టదు. ఈ సినిమాలో సోనాలి బింద్రేతో పాటు అన్షు అనే మరో భామ కూడా నటించింది. మన్మథుడు సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న ఈ ముద్దుగుమ్మ ప్రభాస్ హీరోగా వచ్చిన రెండో సినిమా రాఘవేంద్రలో కూడా ఈమె నటించింది. 

ఈ రెండు సినిమాల్లోనూ చనిపోయే పాత్రలే చేసిన ఈమె ఆ తరువాత అసలు ఇండస్ట్రీలోనే లేకుండా పోయింది. అసలు ఆమె ఎక్కడ ?  ఏం చేస్తుందో అనే విషయం కూడా దాదాపు ఎవరికీ తెలీదు. అయితే టాలీవుడ్ తర్వాత కొన్ని కన్నడ సినిమాలు చేసిన ఈమె లండన్ వెళ్లిపోయింది. అక్కడే పుట్టి పెరిగిన ఆమె లండన్‌లోనే సెటిల్ అయిపోయింది. అక్కడే ఉన్న బిజినెస్‌మేన్ ను పెళ్లి చేసుకుని ఫ్యామిలీ లైఫ్ లోకి ఎంటర్ అయిపొయింది. అంతేకాదు తనకున్న పరిచయాలతో అక్కడ ఫ్యాషన్ డిజైనర్‌గా సంచలనాలు సృష్టిస్తుందట ఈమె. ఏదేమైనా అలా రెండు సినిమాలకి పరిమితం అయినా ఈమెను తెలుగు ప్రేక్షకులు చాలా మిస్ అయ్యారని చెప్పచ్చు..

More Related Stories