సేతుపతి సరసన అనుష్క

ప్రస్తుతం కోలీవుడ్ లో వరుస సినిమాలతో దూసుకువెళ్తున్నాడు మక్కల్ విజయ్ సేతుపతి. ఆయన తెలుగులో కూడా కొన్ని డైరెక్ట్ సినిమాలు ఒప్పుకుని షూట్ లో పాల్గొంటున్నాడు. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సినీ ఎంట్రీ ఇచిహ్న ఈయన మంచి నటుడిగా పేరు తెచ్చుకుని తెలుగు, తమిళ సినీపరిశ్రమలో చేతి నిండా సినిమాలో ఫుల్ బిజీగా ఉంటున్నారు. బాలీవుడ్లో ఆమిర్‌ఖాన్‌తో ‘లాల్‌సింగ్ చద్దా’ సినిమాలోనూ ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు. తాజాగా ఇప్పుడు విజయ్ సేతుపతితో డైరెక్టర్ ఎ.ఎల్.విజయ్ ఓ సినిమాను తెరకెక్కించడానికి ప్లాన్ చేస్తున్నారట.
ప్రస్తుతం కంగనాతో జయ లలిత బయోపిక్ తీస్తున్న ఆయన తరువాత సినిమాగా ఓ మంచి ఫ్యామిలీ సబ్జెక్ట్ ప్లాన్ చేస్తున్నారట. అందులో హీరోయిన్గా అనుష్క శెట్టిని తీసుకోవాలని నిర్ణయించారట. ఇందుకు గాను చర్చలు కూడా జరుపుతున్నాయని సమాచారం. గతంలో విజయ్ తెరకెక్కించిన చిత్రం నాన్నలో అనుష్క కీలక పాత్రలో నటించింది. అదే పరిచయంతో అనుష్క ఈ సినిమాలో యాక్ట్ చేయడానికి ఒప్పుకుంటుందని డైరెక్టర్ విజయ్ నమ్మకంతో ఉన్నారని అంటున్నారు. ఇక సేతుపతి తెలుగు సినిమాల విషయానికి వస్తే ఉప్పెన రిలీజ్ కి రెడీగా ఉంది. ఇక పుష్పలో డేట్స్ కుదరక తప్పుకున్నానని చెప్పినా, అది రేట్ కుదరకే అనే ప్రచారం జరుగుతోంది.