పవర్ స్టార్ ఫ్యాన్ లా సినిమా తీశా...వర్మ

ఈ రోజు పవర్ స్టార్ అంటూ పవన్ ను ఉద్దేశిస్తూ ఒక సినిమా తీసి రిలీజ్ చేశారు వర్మ. థియేటర్స్ నుండి డిజిటల్ కి మరీనా వర్మ ఈ సినిమాని కూడా తన యాప్ లో రిలీజ్ చేసుకున్నాడు. ఇక ఈ సందర్భంగా ఆయనను పలకరించింది సినిమా పాలిటిక్స్. వర్మ స్పందిస్తూ పవర్ స్టార్ సినిమా విజయం చాలా ఆనందనాన్ని ఇస్తుందని చెప్పుకొచ్చారు. సినిమాలో నేను చెప్పాలనుకున్నదే చూపించానని ఆయన అన్నారు. పవర్ స్టార్ అనగానే సినిమా పైన భారీ అంచనాలు ఉంటాయని, పవర్ స్టార్ అనే టైటిల్ లో పవర్ ఉందని ఆయన చెప్పుకొచ్చారు.
తాను పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్ ని కాబట్టి, ఒక ఫ్యాన్ ఎలా ఫీల్ అవుతాడో అలాగే నా సినిమా తీశానని చెప్పుకొచ్చారు. అంతే కాక ఈ సినిమా ను ఎవరు తప్పు పడే అవకాశం నేను ఇవ్వలేదని కూడా వర్మ పేర్కొన్నారు. నేను చివరి దశ లో స్క్రిప్ట్ చేంజ్ చేశాను అనేది అవాస్తవమన్న ఆయన ముందు నుండీ అనుకున్నదే తీశానని పేర్కొన్నాడు. అలానే ఈ సినిమా చూడకుండానే దాడులు చేశారన్న వర్మ అభిమానులు మనసులో ఏముందో అదే విషయాన్ని క్లైమాక్స్ లో చూపించానని పేర్కొన్నారు.