మెగా డాటర్ కు కరోనా షాక్

కరోనా వైరస్ కారణంగా ప్రపంచమే స్థంభించిపోయింది. ఇక సినిమా ఇండస్ట్రీ అందులో ఒక భాగమే కదా. అయితే లాక్ డౌన్ లలో కొన్ని మినహాయింపులు ఇచ్చినా పెద్ద సినిమాల వాళ్ళు ఎవరూ షూట్ కి అయితే వెళ్ళడం లేదు. కొందరు ధైర్యంగా షూటింగ్ చేయాలని చూసినా కూడా భయపెడుతూనే ఉంది ఈ మహమ్మారి. ఇందులో భాగంగానే ఇప్పుడు చిరంజీవి పెద్ద కూతురుని కూడా కరోనా టెన్షన్ పెడుతోంది. ఈమె ఈ మధ్యే 'గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్' అనే నిర్మాణ సంస్థను స్థాపించింది.
అందులోనే వెబ్ సిరీస్‌లు నిర్మించాలని మొదలు పెట్టింది. ఈ మేరకు ఈ మధ్యే ఓ వెబ్ సిరీస్ షూటింగ్ కూడా మొదలు పెట్టింది. అయితే ఇప్పుడు ఉన్నట్లుండి షూటింగ్ ఆపేసారు అనే కంటే ఆపేయాల్సిన పరిస్థితి వచ్చిందని చెప్పచ్చు. ఎందుకంటే ఈ టీమ్‌లోని ఓ వ్యక్తికి కరోనా పాజిటివ్ అని తేలడంతో.. వెంటనే అతనితో క్లోజ్‌గా ఉన్న వాళ్లందరికీ పరీక్షలు చేయించిన సుష్హ్మిత అందర్నీ 14 రోజుల పాటు హోమ్ ఐసోలేషన్‌లో ఉండాల్సిందిగా సుస్మిత తెలుస్తుంది. అలానే ఈ వెబ్ సిరీస్ ఎన్ని ఎపిసోడ్స్ షూట్ చేసారనేది మాత్రం తెలియలేదు. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కరోనా అటాక్ కావడంతో కొన్ని రోజులు షూట్ ఆపాలని ఫిక్స్ అయిపోయినట్టు చెబుతున్నారు.