English   

హీరో విశాల్‌కి కరోనా పాజిటివ్...ఆయన తండ్రి మేనేజర్ కి కూడా

Vishal
2020-07-26 16:14:14

మహమ్మారి కరోనా ఇప్పుడు ఎవరినీ వదలడం లేదు. ఇటీవలి కాలంలో పలువురు సినీ ప్రముఖులు కరోనా వైరస్ బారిన పడుతున్న విషయం తెలిసిందే. బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ కుటుంబం కరోనా వైరస్ తో ఆస్పత్రిలో చేరారు. అర్జున్ కుటుంబ సభ్యులు కూడా కరోనా బారిన పడ్డారు. తాజాగా తమిళ హీరో విశాల్ కరోనా మహమ్మారి బారిన పడ్డారు. తన తండ్రికి కరోనా లక్షణాలైన జ్వరం, జలుబు, దగ్గు కనిపించగా, ఆయనకు తాను సహాయం చేశానని, ఆ క్రమంలో తనకు కూడా ఆ లక్షణాలు కనిపించాయని ఆయన తన సోషల్ మీడియా ద్వారా షేర్ చేసుకున్నారు.

తనకు, తన మేనేజర్ కు కూడా ఆ లక్షణాలు ఉన్నాయని ప్రస్తుతం తామంతా ఆయుర్వేద వైద్యం తీసుకుంటున్నామని, ఓ వారంలో నెగటివ్ వస్తుందన్న నమ్మకం ఉందని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం తమ ఆరోగ్యం నిలకడగానే ఉందని చెప్పడానికి సంతోషిస్తున్నానని విశాల్ వ్యాఖ్యానించారు. ప్రస్తుతం విశాల్‌ రెండు చిత్రాల్లో నటిస్తున్నారు. ‘డిటెక్టివ్‌2’తో పాటు ‘చక్ర’ అనే సినిమాలో నటిస్తున్నారు. అయతే ప్రస్తుతం లాక్‌డౌన్‌ కారణంగా ఈ చిత్రాల షూటింగ్‌ తాత్కాలికంగా వాయిదా పడింది.

More Related Stories