English   

వర్మ పవర్ స్టార్ రివ్యూ 

 power star
2020-07-26 09:33:30

వర్మ బుర్ర పెట్టి సినిమాలు తీయడం ఎప్పుడో మానేశాడు. ఇప్పుడు కేవలం ఆయన పబ్లిసిటీ చేసి సినిమాలు తీస్తున్నారు. అలా చేసి తీసిన మరో సినిమానే పవర్ స్టార్. డాన్ని సినిమా అనే కంటే కూడా సాగదీసిన ఓ వెబిసోడ్ అనచ్చేమో.
 
ఇక కథ ఏంటంటే 

ఎన్నికల ఫలితాలు వెలువడిన రోజు నుంచి ప్రవన్ కళ్యాణ్(పవన్ ఇమిటేషన్) మానసికంగా వేదనకు గురయి ఇన్నాళ్లు తాను ప్రజాక్షేత్రంలో తిరిగి, ప్రజల కోసం సినిమాలు కూడా త్యాగం చేస్తే ఒక్కటంటే ఒక్క సీటు రాకపోవడం ఆయనకు ఎంతో వేదనగా ఉంటుంది. అయితే ఇది ప్రవన్ కళ్యాణ్ తప్పు గా కాకుండా తన చుట్టూ ఉన్న వాళ్ళ మాటలు విని, నమ్మి నిర్ణయాలు తీసుకోవడం వల్లే ఇలాంటి ఫలితాలు వచ్చాయనే యాంగిల్ లో ఈ వెబిసోడ్ సాగుతుంది. చివరకు వర్మ ఎంట్రీ పలు సూక్తులతో ఈ వ్యవహారం ముగుస్తుంది.

ఫ్లస్ పాయింట్స్ & మైనస్ పాయింట్స్

ప్లస్ పాయింట్స్ అంటూ ఏమీ లేవు. ఏదో డూప్ నటులను పెట్టి తనకున్న అభిప్రాయాలను రుద్ది తకువ ఖర్చులో ఏదో తీసి జనాన్ని ఎర్రోల్లని చేసే ప్రయత్నమే ఇది. కేవలం పబ్లిసిటీతో పెట్టిన ఖర్చుకు ఎన్నింతలు సంపాదించుకున్నాడో మరి. అయితే ప్రవన్ పాత్రను నేరుగా చెడ్డగా చూపించకుండా, అతను కేవలం చెప్పుడు మాటల వల్ల తప్పుడు నిర్ణయాలు తీసుకున్నాడనే కోణంలో దీనిని తీయడం వలన పవన్ ఫ్యాన్స్ విషయమ్లో సేఫ్ అని చెప్పచ్చు. ఇక పాత్రలకు పోలిన నటులను ఎంచుకోవడం అదే రకమైన డబ్బింగ్ లు చెప్పించడం ఒక్కటే ప్లస్ పాయింట్.

విశ్లేషణ :

మొత్తం నిడివి 37 నిముషాలు, అందులో 4 నిముషాలు టైటిల్స్ 4 నిముషాల పాటు గడ్డి తింటావా అనే పాట ఒకటి ఉంది. 3 నిముషాల పాటు ఒక్కో పాత్రతో దీన్ని పూర్తి చేసాడు. చిరంజీవి, త్రివిక్రమ్, చంద్రబాబు, నాదెండ్ల మనోహర్, బండ్ల గణేష్ తో ఆరు పాత్రలు... మొత్తం  18 నిమషాలు. 18 ప్లస్ 8, అంటే 26. కాసేపు వర్మ ఎంట్రీ.  మొత్తంగా ఇది కలగాపులగం బిస్బిల్లా బాత్ అనొచ్చు 

More Related Stories