టాలీవుడ్ నటుడు హఠాన్మరణం...విషాదంలో ఇండస్ట్రీ

టాలీవుడ్ లో విషాదం నెలకొంది. కళామతల్లి మరో నటుడ్ని కోల్పోయింది. సీనియర్ నటుడు మంచాల సూర్యనారాయణ గుండెపోటుతో మరణించారు. హైదరాబాద్ మోతీ నగర్ లోని గ్రీన్ పార్కు రెసిడెన్సీ అపార్ట్మెంట్లో మంచాల నివాసం ఉంటున్నారు. గత కొద్ది రోజులుగా గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతూన్న ఆయన నిన్న ఆస్పత్రికి తీసుకెళ్లే క్రమంలో తన తుది శ్వాస వదిలారు. సూర్యనారయణ ప్రభుత్వం లాక్ డౌన్ విధించినప్పటి నుంచి ఇంటికే పరిమితమయ్యారు. ఇంట్లోనే ఉండి మానసిక ఒత్తిడికి లోనయ్యారని అయితే కొద్ది రోజులుగా సీరియల్ షూటింగ్స్ మొదలు కావడంతో ఆయన మళ్ళీ షూట్ కి వెళ్తున్నారని ఈ క్రమంలోనే ఆయనకి హఠాత్తుగా గుండెపోటు వచ్చిఉండవచ్చని అంటున్నారు. నాటక రంగం నుంచి సినిమాల దాకా సూర్యనారాయణ ప్రస్థానం సాగింది. అనేక నాటకాలు, టీవీ సీరియళ్లలో నటుడిగా, హాస్యనటుడిగా, తనదైన శైలీలో అందరిని మెప్పించి, ప్రశంసలు పొందారు.వదినమ్మ, రామచక్కని సీత సీరియళ్లలో కూడా ఆయన నటించారు. మూడు రోజుల కిందట వదినమ్మ సీరియల్ ఘాటింగ్ లో పాల్గొన్నారని సమాచారం.మంచాల సూర్యనారాయణ హఠాన్మరణంతో టెలివిజన్ ఇండస్ట్రీలో విషాదం నెలకొంది.