సినీ ప్రియులకి శుభవార్త...థియేటర్స్ ఓపెన్.. ఎప్పటి నుండి అంటే

దేశవ్యాప్తంగా లాక్డౌన్ సడలింపుల నేపథ్యంలో దాదాపు అన్ని రంగాల్లో కార్యకలాపాలు తిరిగి పునఃప్రారంభమయినా కొన్నిటిని మాత్రం అనుమతించలేదు. అవి స్కూల్స్, కాలేజ్ లు, స్విమ్మింగ్ పూల్స్ అలానే థియేటర్స్. అయితే థియేటర్ల రీ ఓపెనింగ్ విషయం మీద ప్రభుత్వం ఇంకా నిర్ణయం తీసుకోలేదు. అయితే ఆగస్ట్ నెలలో థియేటర్ల పునఃప్రారంభానికి అనుమతులివ్వాలని కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వశాఖ హోంశాఖకు సిఫారసు చేసినట్టుగా సమాచారం అందుతోంది.
నిన్న ఢిల్లీలో థియేటర్ ఓనర్స్ అసోసోఎషన్స్ ప్రతినిధులతో కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వశాఖ కార్యదర్శి అమిత్ ఖరే సమావేశమయ్యారు. ఆగస్ట్ 1 నుంచి థియేటర్లను పునఃప్రారంభించేందుకు ఆదేశాలివ్వాలని హోంమంత్రిత్వ శాఖను కోరామని, ఈ విషయంలో ఆ శాఖ కార్యదర్శి అజయ్ భల్లా తుది నిర్ణయం తీసుకుంటారని అమిత్ వెల్లడించారు. ఒకవేళ థియేటర్లు ఓపెన్ చేసేట్టు అయితే ఓ వరుసను ఖాళీగా ఉంచుతూ సీటు విడిచి మరో సీటులో ప్రేక్షకులు కూర్చొనే విధంగా ఏర్పాట్లు చేసి భౌతికదూరం పాటించాలని ఆయన అన్నారు. అలానే ప్రతిషో అయిన వెంటనే సీట్ల శానిటైజేషన్ చేయాలని సూచించారు. అయితే దీనిపై ఇంకా చర్చలు జరిగే అవకాశం ఉంది.