English   

రెండో పెళ్లనుకున్నారు..కానీ అది అనౌన్స్ చేసి షాకిచ్చిన నటి

 Sonia agarwal
2020-07-26 17:50:17

నటి సోనియా అగర్వాల్ అంటే అందరికీ గుర్తుండక పోవచ్చు కానీ బృందావన్ కాలనీ అనిత అంటే గుర్తు పట్టేస్తారు. తెలుగులో ఆమె చేసింది చాలా తక్కువ చిత్రాలే అయినా ‘7జి బృందావన కాలనీ’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులు మరిచిపోలేని విధంగా ఆమె ఆకట్టుకుంది. అయితే ఆ తర్వాత ఆమె బృందావన కాలనీ సినిమా దర్శకుడైన సెల్వరాఘవన్‌ను పెళ్లి చేసుకుంది. అయితే అన్ని సినిమా పెళ్ళిళ్ళ లానే ఇది కూడా మున్నాళ్ళ ముచ్చటలానే ముగిసింది. ఇద్దరి మధ్య మనస్పర్థలు రావడం, విడాకులు తీసుకోవడం, సెల్వరాఘవన్ మరో పెళ్లి చేసేసుకోవడం కూడా చకచకా జరిగిపోయాయి. 

ఎందుకో ఏమో కానీ సోనియా మాత్రం సింగిల్ ‌గానే ఉంటూ వచ్చింది. తాజాగా ఆమె మరో పెళ్లి చేసుకోబోతోందా అనేలా.. ఆమె కొన్ని హింట్స్ ఇస్తూ ట్వీట్స్ చేసింది. సోనియా అగర్వాల్ నిన్న నిశ్చితార్థపు ఉంగరాలను పోస్ట్ చేసింది. అంటే ఆమెకు మరో వివాహం కోసం నిన్న నిశ్చితార్థ కార్యక్రమాలు జరుగనున్నాయనేలా ఆమె విడుదల చేసిన రింగ్స్ ఫొటో ఊహాగానాలు పెంచింది. అయితే అదేమీ లేదని ఆమె తేల్చేసింది. అదేంటంటే ఆమె ఒక వెడ్డింగ్ ప్లానింగ్ కంపెనీని లాంచ్ చేసింది. టెల్ ఆఫ్ టూ అంటూ ఒక ప్లానింగ్ కంపెనీని ప్రకటించింది.

More Related Stories