English   

కరోనా సమయంలో కూడా ఘనంగా జరిగిన నితిన్ పెళ్లి..

 Nithiin
2020-07-27 07:23:52

అభిమానులు లేరనే బాధ తప్ప నితిన్ పెళ్లి అద్భుతంగా జరిగింది. జూలై 26 రాత్రి 8 గంటల 30 నిమిషాలకు ఫలక్నామా ప్యాలెస్ లో నితిన్ షాలిని వివాహం జరిగింది. దీనికి పలువురు సినీ రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. కరోనా వైరస్ విజృంభిస్తున్న ఈ సమయంలో అన్ని జాగ్రత్తలు తీసుకుని నియమ నిబంధనలకు లోబడి ఈ పెళ్లి వేడుక జరిగింది. రెండు కుటుంబాల నుంచి అత్యంత సన్నిహితులు మాత్రమే నితిన్ పెళ్లికి హాజరయ్యారు. మరోవైపు సినీ రాజకీయ ప్రముఖులు కూడా కొందరు మాత్రమే వచ్చారు. తెలంగాణ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఈ పెళ్లికి హాజరయ్యాడు. కరోనా ఉన్న నేపథ్యంలో సినిమా ఇండస్ట్రీ నుంచి ఎవరూ పెద్దగా రాలేదు. పరిస్థితులు చక్కబడిన తర్వాత పెద్ద పార్టీ ఇవ్వాలని చూస్తున్నాడు నితిన్. రెండు రోజుల ముందే పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ శ్రీనివాస్ ఆయన ఇంటికి వచ్చి ఆశీర్వదించి వెళ్లారు. మరోవైపు చాలా మంది ఫోన్లో నితిన్ కు అభినందనలు తెలిపారు. ఈ సమయంలో కూడా ఏ మాత్రం తక్కువ కాకుండా భారీ హంగులతో నితిన్ వివాహం జరిగింది. ఎప్పుడో ఎప్రిల్ లోనే జరగాల్సిన ఈ పెళ్ళి కరోనా వైరస్ కారణంగా ఇన్ని రోజులు వాయిదా పడుతూ వచ్చింది. 

More Related Stories