English   

ఆగస్టులో థియేటర్స్ రీ ఓపెన్.. ప్రభుత్వం చెప్పినట్లు చేస్తారా..

cinema theaters
2020-07-27 07:52:09

లాక్ డౌన్ కారణంగా 130 రోజులుగా సినిమా థియేటర్లు మూత పడ్డాయి. మార్చి 25 నుంచి దేశంలో సినిమా హాల్స్ అన్నీ మూసేసారు. దాంతో వేలాది మందికి ఉపాధి లేకుండా పోయింది. ఎప్పుడు ఎప్పుడు మళ్ళీ థియేటర్స్ ఓపెన్ చేస్తారా అని వేచి చూస్తున్నారు వాళ్ళు. అలాగే డిస్ట్రిబ్యూటర్లు, సినిమా ఇండస్ట్రీ కూడా థియేటర్ల రీఓపెనింగ్ కోసం కళ్ళు కాయలు కాసేలా చూస్తున్నారు. కానీ రోజురోజుకీ కరోనా వైరస్ విజృంభించడంతో ఇప్పట్లో థియేటర్ ల గురించి మర్చిపోవాల్సిందే అని అందరూ అనుకున్నారు. కానీ ఊహించని విధంగా కేంద్రం సంచలన నిర్ణయం తీసుకుంటుందని ప్రచారం జరుగుతుంది. అన్నీ కుదిరితే ఆగస్టు నుంచి థియేటర్లు తెరుచుకోవడం ఖాయంగా కనిపిస్తుంది. 

అయితే ఇది సింగిల్ స్క్రీన్ కు వర్తించదు. కేవలం మల్టీప్లెక్స్ థియేటర్స్ ఓపెన్ చేసుకోవచ్చని కేంద్రం సూచించేలా కనిపిస్తోంది. అది కూడా అప్పట్లో నాలుగు ఆటలు కాదు.. రాత్రి ఏడు గంటల లోపు 3 ఆటలు మాత్రమే ప్రదర్శించాలని నిబంధనలు పెడుతుంది. దానికి తోడు థియేటర్లలో కుర్చీల మధ్య గ్యాప్ ఉండాలని.. సానిటైజర్ అందుబాటులో ఉంచాలని సూచించింది. దాంతో పాటు అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని థియేటర్ ఓనర్ లకు కేంద్రం కండిషన్స్ పెడుతోంది. కేవలం 25 శాతం టికెట్లు మాత్రమే అమ్ముకోవాలని  కండిషన్ కూడా పెడుతున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ నిబంధనకు థియేటర్ యాజమాన్యం ఒప్పుకోవడం లేదు. కేవలం పాతికశాతం టికెట్స్ మాత్రమే అమ్మాలి అంటే దానికంటే థియేటర్స్ మూసి వేయడమే మంచిది అంటున్నారు వాళ్ళు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో థియేటర్స్ ఓపెన్ చేసినా కూడా ఆడియన్స్ వస్తారా అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న. 

More Related Stories