English   

నాగశౌర్య  స్ట‌న్నింగ్ ఫస్ట్ లుక్ 

Naga Shaurya
2020-07-27 12:16:24

'అశ్వద్ధామ' సినిమా తీసి ఫ్లాప్ మూటగట్టుకున్న శౌర్య ఇప్పుడు మరో సినిమాని లైన్ లో పెట్టాడు.  ఆయన 20వ సినిమాగా తెరకెక్కనున్న ఈ సినిమా ప్రీ లుక్ ఇటీవ‌లే విడుద‌ల చేశారు. దీనికి మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. ఇక తాజాగా కొద్దిసేపటి క్రితం శేఖ‌ర్ క‌మ్ముల ఫ‌స్ట్ లుక్ విడుద‌ల చేశారు. ఇందులో కండ‌లు తిరిగిన దేహంతో విల్లు ఎక్కు పెట్టిన‌ట్టుగా శౌర్య క‌నిపిస్తున్నాడు. ఇక నాగ‌శౌర్య ట్రాన్స్ఫార్మ్ అయిన ఈ లుక్ చూసి ఫ్యాన్స్ తెగ మురిసిపోతున్నారు. దీని టైటిల్ ఇంకా ప్రకటించ లేదు కానీ 'పార్థు' అనే టైటిల్ అనుకుంటున్నట్టు చెబుతున్నారు. 'సుబ్రహ్మణ్య పురం' దర్శకుడు సంతోష్ జాగర్లపూడి ఈ సినిమాకి దర్శకుడిగా వ్యవహరిస్తున్న ఈ సినిమాని ఏషియన్ సునీల్ నిర్మించనున్నారు. 

ఇకఈ సినిమా 'విలు విద్య'కి సంబంధించిన కాన్సెప్ట్ తో ఈ సినిమా రూపొందనున్నట్టుగా చెబుతున్నారు. పార్ధు అంటే అర్జునుడు, అర్జునుడు అంటే విలువిద్యకి ఎంతో ఫేమస్. అలాంటి ఆయన పేరిట ఈ సినిమా తెరకెక్కిస్తున్నట్టు చెబుతున్నారు. ఇక ఈ సినిమాతో పాటు సితార ఎంటర్ టైన్ మెంట్స్ లో సౌజన్య అనే డైరక్టర్ తో ఈయన మరో సినిమా కూడా ఓకే చేశాడు. ఇది కాక అవసరాల శ్రీనివాస్ దర్శకత్వంలో 'ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి' సినిమా షూటింగు దశలో వుంది. ఇప్పటికే ఈ సినిమా రెండు షెడ్యూళ్లు కూడా పూర్తిచేసేసుకుందట.

More Related Stories