సోషల్ మీడియా వేధింపులు...నటి ఆత్మహత్యాయత్నం

ఈరోజుల్లో పాపులర్ కావడానికి బాగా ఉపయోగపడుతున్న సోషల్ మీడియాలో కొందరిని డిప్రెషన్ లోకి కూడా నెట్టి వేస్తోంది. తాజగా అలానే తమిళ నటి విజయలక్ష్మి ఆత్మహత్యాయత్నం చేశారు. ఆత్మహత్యాయత్నానికి ముందు ఆమె సోషల్ మీడియాలో వేధింపులు, బెదిరింపుల కారణంగానే తాను ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నానని పేర్కొంటూ ఓ వీడియో పోస్ట్ చేశారు. 'నామ్ తమిళర్' పార్టీ నేత సీమన్, 'పనన్కట్టు పడై'కి చెందిన హరి నాడార్ ఫాలోవర్స్ తనను వేధిస్తున్నారని విజయలక్ష్మి ఆ వీడియోలో పేర్కొన్నారు.
నిన్న తన ఫేస్బుక్లో ఓ వీడియో పోస్టు చేసిన విజయలక్ష్మి కొన్ని పిల్స్ తీసుకున్నానని అవి తీసుకుంటే రక్తపోటు తగ్గిపోయి మరణం సంభవిస్తుందని పేర్కొన్నారు. అలానే తన చావు అందరికీ కనువిప్పు కావాలని చెప్పింది విజయలక్ష్మి. ప్రధానంగా సీమన్, హరి నాడార్ ఫాలోవర్లు తనను వేధిస్తున్నారని, వారిద్దరినీ అరెస్ట్ చేయాలని విజయలక్ష్మి వీడియోలో డిమాండ్ చేశారు. అయితే ఈ వీడియో నేపధ్యంలో అప్రమత్తమైన కుటుంబసభ్యులు విజయలక్ష్మిని చెన్నైలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతానికి ఆమె ప్రాణానికి అయితే ప్రమాదం లేదని, ఆమె అక్కడ చికిత్స పొందుతున్నదని తెలుస్తోంది.