English   

క్రేజీ కాంబో అల్లు అర్జున్ తో కొరటాల 

 Allu Arjun
2020-07-27 17:11:13

మెగాస్టార్ చిరంజీవి, కొరటాల శివ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న మూవీ ఆచార్య. ఈ సినిమా అనౌన్స్ చేసినప్పటి నుండి ఈ సినిమా మీద భారీ ఆంచనాలున్నాయి. అయితే ఈ సినిమా బాగా లేటయిందని చెప్పచ్చు. అందుకేనేమో ఇది పూర్తి అవగానే చేయడానికి ఇప్పటి నుండే వరుస సినిమాలు లైన్ లో పెట్టాడు చిరంజీవి. ఇప్పటికే ఆయన ముగ్గురు దర్శకులను తన నెక్స్ట్ మూవీ కొరకు లైన్ లో పెట్టారు. మెహర్ రమేష్, బాబీ అలాగే సుజీత్ తో కథా చర్చలు జరుగుతున్నాయని ఆయన చెప్పారు కూడా. అవన్నీ పక్కన పెడితే కొరటాల కూడా సినిమా రిలీజ్ చేసి రెండు ఏళ్ళు గడిచి పోయింది. అందుకే చిరు సినిమాని త్వరగా పూర్తి చేసి రిలీజ్ చేద్దామనుకున్నాడు. కానీ కరోనా దెబ్బకు అది ఇప్పట్లో రిలీజ్ అయ్యే పరిస్థితి లేదు. అయితే ఈ సినిమా తరువాత కొరటాల శివ అల్లు అర్జున్‌ తో కలిసి ఓ సినిమా చేయనున్నాడని ప్రచారం జరుగుతోంది. బన్నీతో కలిసి సినిమా చేయడానికి కొరటాల కూడా ఉత్సాహం చూపుతున్నాదడని అంటున్నారు. ఇది ఫైనల్ అయితే ‘పుష్ప’ సినిమా పూర్తి అయిన వెంటనే ఈ ప్రాజెక్టును పట్టాలెక్కించవచ్చని అంటున్నారు.  

More Related Stories