English   

ఆగష్టులో షూట్ కు వెళ్లనున్న ఆచార్య 

 Acharya
2020-07-27 17:23:45

మెగాస్టార్ చిరంజీవి - దర్శకుడు కొరటాల శివ కాంబినేషన్‌లో వస్తున్న తాజా మూవీ ఆచార్య. కరోనా వలన ఏర్పడిన లాక్‌డౌన్‌తో సినిమా షూటింగ్ ఆగిపోయింది. అయితే ఇప్పటికే ఈ సినిమా సుమారు 70 శాతం షూటింగ్ పూర్తయిందని అంటున్నారు. ఈ సినిమా అనౌన్స్ చేసినప్పటి నుండి ఈ సినిమా మీద భారీ ఆంచనాలున్నాయి. అయితే ఈ సినిమా ఎందుకో కానీ బాగా లేటయిందని చెప్పచ్చు. అందుకేనేమో ఇది పూర్తి అవగానే చేయడానికి ఇప్పటి నుండే వరుస సినిమాలు లైన్ లో పెట్టాడు. ఇప్పటికే ఆయన ముగ్గురు దర్శకులను తన నెక్స్ట్ మూవీ కొరకు లైన్ లో పెట్టారు. మెహర్ రమేష్, బాబీ అలాగే సుజీత్ తో కథా చర్చలు జరుగుతున్నాయని ఆయన చెప్పారు కూడా. సుజీత్ కి ఆయన మలయాళ సూపర్ హిట్ మూవీ లూసిఫర్ తెలుగు రీమేక్ బాధ్యతలు అప్పగించారు. ఆ స్క్రిప్ట్ పై ప్రస్తుతం సుజీత్ పని చేస్తున్నారు.

 అయితే కరోనా లాక్ డౌన్ కారణంగా అన్ని పరిశ్రమలతో పాటు సినిమా పరిశ్రమ కూడా కుదేలైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సమీప కాలంలో చిత్ర పరిశ్రమ మునుపటి స్థితికి రావడానికి చాలా సమయం పట్టేలా ఉందని అంటున్నారు. ప్రభుత్వాలను బతిమలాడి పర్మిషన్స్ తెచ్చుకున్నా ఇప్పట్లో షూట్ చేసే పరిస్థితి అయితే లేదు. అయితే ఆచార్య షూట్ ఆగస్టులో ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. చిరంజీవి ఇందులో దేవదాయ-ధర్మాదాయ శాఖలో ఓ ప్రభుత్వ ఉద్యోగి పాత్రలో నటించనున్నారని ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే డెబ్బై శాతం పైగా చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమాని కొణిదెల ప్రొడక్షన్స్, మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.  

More Related Stories