English   

పుష్ప తర్వాత మరో పాన్ ఇండియా సినిమాలో రష్మిక మందన..

Rashmika mandanna
2020-07-28 09:04:04

సరిలేరు నీకెవ్వరు, భీష్మ లాంటి వరుస విజయాలతో తెలుగులో ప్రస్తుతం రష్మిక మందన్న కెరీర్ ప్రస్తుతం టాప్ గేర్ లో ఉంది. వరుస విజయాలకు తోడు అమ్మడి టాలెంట్ కూడా సినిమాలకు బాగా కలిసొస్తుంది. తెలుగులో అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ తెరకెక్కిస్తున్న పుష్ప సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది రష్మిక. దీన్ని పాన్ ఇండియా ప్రాజెక్టుగా తెరకెక్కిస్తున్నాడు సుకుమార్. తెలుగుతో పాటు తమిళ మలయాళ హిందీ కన్నడ భాషల్లో కూడా పుష్ప విడుదల కానుంది. ఇందులో పూర్తిగా డి గ్లామర్ రోల్ చేస్తుంది రష్మిక. ఈ సినిమాతో కచ్చితంగా అన్ని ఇండస్ట్రీలలో తనకు ఇమేజ్ వస్తుందని నమ్ముతుంది రష్మిక మందన. ఇప్పటికే కన్నడలో రష్మిక మందన స్టార్ హీరోయిన్. తమిళ్ లో కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇప్పుడు పుష్ప సినిమాతో అది మరింత పెరుగుతుందని నమ్ముతుంది ఈ ముద్దుగుమ్మ.

ఈ సమయంలో మరో పాన్ ఇండియా సినిమా కూడా రెడీ అవుతుంది. కన్నడలో ఈమె నటించిన పొగరు సినిమాని అన్ని భాషల్లో విడుదల చేయాలని దర్శక నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. కొన్ని రోజుల కింద గుండెపోటుతో మరణించిన చిరంజీవి సర్జా తమ్ముడు ధ్రువ సర్జ ఇందులో హీరో. ఇప్పటికే విడుదలైన పాటలు ట్రైలర్ కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు తెలుగులో కూడా ఈ సినిమా పాటలను విడుదల చేశారు. రష్మిక మందన ఉండటంతో తెలుగులో పొగరు సినిమాకు బిజినెస్ జరుగుతుందని నమ్ముతున్నారు దర్శక నిర్మాతలు. ఇదిలా ఉంటే తమిళం మలయాళం హిందీలో కూడా ఈ సినిమాను విడుదల చేయాలని చూస్తున్నారు. ఇప్పటికే బాలీవుడ్ లో కేజిఎఫ్ సినిమాతో కన్నడ ఇండస్ట్రీపై మంచి ఇంప్రెషన్ పడింది. దాంతో ఇప్పుడు పొగరు సినిమాకు కూడా అక్కడ బిజినెస్ జరుగుతుందని నమ్ముతున్నారు. ఈ సినిమాను వీలైనంత త్వరగా పూర్తిచేసి ప్రమోషన్ చేయాలని భావిస్తున్నారు యూనిట్. మొత్తానికి రష్మిక మందన ఒకేసారి రెండు పాన్ ఇండియా సినిమాలతో రాబోతుంది. 

More Related Stories