English   

ప్రవీణ్‌ సత్తారుతో నాగ్ యాక్షన్ ఎంటర్​టైనర్

Nagarjuna Praveen Sattaru
2020-07-28 09:20:07

మన్మథుడు 2’ సినిమా లాంటి భారీ డిజాస్టర్ సినిమా తర్వాత అక్కినేని నాగార్జున ‘వైల్డ్ డాగ్’ అనే కాప్ ఓరిఎంటెడ్  మూవీకి కమిట్ అయ్యాడు. మహర్షి సినిమాకి రచయితగా పని చేసిన సాల్మన్ అనే వ్యక్తిని ఈ సినిమా సినిమా ద్వారా దర్శకుడిగా పరిచయం చేస్తున్నారు. విజయ వర్మ అనే ఒక ఎన్ఏఐ ఆఫీసర్ జీవిత కథనే సినిమాగా మలుస్తున్న ఈ సినిమా షూట్ కూడా దాదాపుగా కంప్లీట్ కావొచ్చింది. ఇంతలో కరోనా రావడంతో ఆ సినిమా షూట్ చివర్లో ఆగింది. ఇక ఇప్పుడు నాగ్ ‘సోగ్గాడే చిన్నినాయనా’ ప్రీక్వెల్ ‘బంగార్రాజు’ని త్వరలోనే పట్టాలెక్కించాలని ప్లాన్ చేస్తున్నాడు. ఈ సినిమాని  అక్టోబర్ మొదటి వారంలో ఈ సినిమాను మొదలుపెట్టి, సింగిల్ షెడ్యూల్ లోనే షూటింగ్ ను పూర్తి చేసి వచ్చే సంక్రాంతికి బంగార్రాజు సినిమాని రిలీజ్ చేయాలని చిత్రబృందం ప్లాన్ చేస్తోందట. ఆ విషయం పక్కన పెడితే ఆయన ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో ఒక సినిమా కమిట్ అయ్యాడని ప్రచారం జరగగా దాని మీద క్లారిటీ వచ్చింది. 

ఏషియన్ గ్రూప్ చైర్మన్ నారాయణదాస్ నారంగ్ జన్మదినం సందర్భంగా, శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ ఎల్ పి మరియు నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్ తాము సంయుక్తంగా కింగ్ నాగార్జున హీరోగా నిర్మించనున్న ఈ భారీ బడ్జెట్ సినిమాని ప్రకటించారు. ఈ చిత్రాన్ని తమ రెండు బ్యానర్ల మీద నిర్మాతలు నారాయణదాస్ నారంగ్, పుస్కూర్ రామ్మోహన్ రావు, శరత్ మరార్ నిర్మించనున్నారు. ఇది ఒక ఇన్విస్టిగేటివ్ జానర్ సినిమా అని అంటున్నారు. ప్రస్తుతానికి ప్రవీణ్‌ ప్రవీణ్‌ బ్యాడ్మింటన్‌‌‌ క్రీడాకారుడు పుల్లెల గోపీచంద్‌ జీవితాధారంగా ఓ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. ఇందులో సుధీర్‌ బాబు హీరోగా నటిస్తున్నాడు. బంగార్రాజు-గోపీ చంద్ సినిమాలు పూర్తి అయ్యాక ఈ సినిమా పట్టాలెక్కనుందని చెబుతున్నారు.

More Related Stories