English   

సోనూ సూద్ ఆస్తి ఎంతో తెలుసా..

sonu sood
2020-07-28 13:08:43

కరోనా కల్లోలం అన్ని రంగాలను ఇబ్బంది పెడుతోంది. ఇప్పటికే చాలా మంది ఈ కరోనా బారిన పడి మరణించారు. అయితే ఈ వైరస్ వలన చనిపోయిన వారి కంటే ఈ వైరస్ వలన ఏర్పడిన లాక్ డౌన్ వలనే ఎక్కువ మంది మరణించి ఉంటారు. ఎందుకంటే రాష్ట్రం కాని రాష్ట్రం వెళ్లి, ఎవరెవరి కోసమో మధ్య కేవలం ఉపాధి కోసం బతుకుతారు వలస కూలీలు. అలాంటి వలస కూలీలకు ఈ వైరస్ పెట్టిన ఇబ్బంది అంతా ఇంతా కాదు. సొంత రాష్ట్రం వెళ్లలేక ఉన్నచోట ఉండ ఏమి చేయలేని దీనస్థితి లో ఉన్న వలస కార్మికులు  ఎవ్వరు ఆదుకుంటారో అని ఎదురు చూస్తున్న క్రమంలో సోనూ సూద్ లాంటి కొందరు రోడ్డెక్కి తమ సొంత వాళ్ళులా వలస కూలీలను భావించి ఎన్నో వేల మందిని సొంత ఊళ్లకు పంపాడు. అతను సినిమాల్లో వేసేది విలన్ వేషాలు అయినా అతను చూపిన చొరవ హీరోలని చెప్పుకునే వారు కూడా చేయని పని ఆయన చేశాడు, వారి కోసం నిలబడ్డాడు. 

ఎంతో మంది సినీ ప్రముఖులు తమ వంతు సేవలు చేస్తున్నా సోను సూద్ వారి కోసం చేస్తున్న సాయం వెలకట్టలేనిది. బస్సులు, రైళ్లు, విమానాలు ఇలా ఒక్కటేమిటి.. వలస కార్మికులు స్వగ్రామాలకు చేరేందుకు స్థాయికి మించిన సహాయాన్ని చేస్తున్నారు సోను.  అంతేకాక కష్టం అనే మాట ఎక్కడుంటే అక్కడ తానున్నానని నిరూపించుకుంటున్నాడు ఆయన. వందల కోట్ల కలెక్షన్లతో కోట్లలో రెమ్యూనరేషన్ తీసుకుంటున్న హీరోలు సైతం చేయని సాయం సోనూ చేస్తున్నారు. దీంతో ఆయన ఆస్తి ఎంత? అంతలా ఎలా ఖర్చు చేస్తున్నాడన్నది అందరినీ తొలుస్తున్న ప్రశ్న. 

సోనూ సూద్ పై తాజాగా ఓ బాలీవుడ్ మీడియా సంస్థ అధ్యయనం చేయగా.. అతడి మొత్తం ఆస్తుల విలువ 130 కోట్లు అని తేలింది. 20 ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉన్న సోనూ సూద్ సినిమాల ద్వారానే సంపాదించాడు. ఆ డబ్బుతో ముంబైలో హోటళ్లు తెరిచాడని అంటున్నారు. ఈ కరోనా సమయంలో ఆయన ఆస్తి 130 కోట్లలో ఇప్పటికే 10కోట్ల వరకు ఖర్చు చేసుంటాడని అంటున్నారు. పిల్లికి కూడా బిచ్చం పెట్టని సెలబ్రిటీలున్న ఈరోజుల్లో ఇంత ఖర్చు పెట్టడం మామూలు విషయం కాదుగా. 

More Related Stories