English   

వర్మ మర్డర్ ట్రైలర్.. పిల్లలను ప్రేమించడం తప్పా..

 RGV Murder
2020-07-28 13:26:21

పిల్లల్ని కనగలం గాని వాళ్ల మనస్తత్వాలను కనగలమా అంటూ సంచలన ప్రశ్నతో రాంగోపాల్ వర్మ ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు.  ఈయన తెరకెక్కిస్తున్న మర్డర్ ట్రైలర్ విడుదలైంది. పిల్లలను కనగలం కానీ వాళ్ళ మనస్తత్వం కనలేం కదా.. 'సమాధానం మీరే చెప్పండి' అని ప్రేక్షకులను ప్రశ్నిస్తున్నాడు . ఆర్జీవీ నేతృత్వంలో దర్శకుడు ఆనంద్ చంద్ర ఈ సినిమా తెరకెక్కించాడు. తెలుగు రాష్ట్రాలలోనే కాదు మొత్తం దేశంలో సంచలనం సృష్టించిన ప్రణయ్ అమృత ఘటన ఆధారంగా  ఈ సినిమా తెరకెక్కించాడు వర్మ. దీనికి 'కుటుంబ కథా చిత్రమ్' అనే ట్యాగ్‌లైన్ పెట్టాడు. కూతురు అతిగా ప్రేమించిన ఒక తండ్రి చివరికి ఏమయ్యాడు అనేదే ఈ సినిమా కథ అంటున్నాడు వర్మ. పిల్లలను అతిగా ప్రేమించడం కూడా తప్పేనా అని ప్రశ్నిస్తున్నాడు. కన్న కూతురు అమృత వేరే కులానికి చెందిన అబ్బాయి ప్రణయ్ ను ప్రేమించి పెళ్లి చేసుకోవడం జీర్ణించుకోలేని తండ్రి మారుతీరావు.. కిరాయి రౌడీలతో సొంత అల్లుడిని 2018 సెప్టెంబర్ 14న చంపించాడు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ ఘటన ఇప్పుడు సినిమా రూపంలో రాబోతుంది.

'పిల్లల్ని ప్రేమించడం తప్పా?'
'తప్పు చేస్తే దండించడం తప్పా?'
'వేరే గతి లేనప్పుడు చంపించడం తప్పా?'

ఈ ప్రశ్నలు ట్రైలర్లో చూపించాడు వర్మ. దీన్నిబట్టి మారుతీరావు చేసింది తప్పు కాదు అని ఆయన చూపించే ప్రయత్నం చేస్తున్నాడు. సినిమాను పూర్తిగా మారుతీరావు అనుకూలంగా తీస్తున్నట్లు ట్రైలర్స్ చూస్తే అర్థమవుతుంది. విడుదలైన తర్వాత కానీ లోపల ఏముంది అనేది తెలియదు. ఇప్పటి వరకు ఈ మధ్య కాలంలో వర్మ చేసిన సినిమాలతో పోలిస్తే మర్డర్ కాస్త క్వాలిటీగా ఉంది. ఇందులో మారుతి రావు పాత్రలో శ్రీకాంత్ అయ్యంగార్‌, అమృత పాత్రలో సాహితి నటించారు. ఈ మధ్య కాలంలో వర్మ సినిమాలతో పోలిస్తే మర్డర్ పర్లేదు అనిపిస్తుంది. ట్రైలర్ చూస్తుంటే ఆసక్తికరంగా ఉంది. మరి సినిమా ఎలా ఉంటుందో చూడాలి.

More Related Stories