English   

నటుడు కిక్ శ్యామ్ అరెస్ట్.. గ్యాంబ్లింగ్ చేస్తూ పోలీసులకు..

Kick Shyam
2020-07-28 13:33:31

కిక్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన నటుడు శ్యామ్. ఆ తర్వాత ఆయన తెలుగులో ఊసరవెల్లి, రేసుగుర్రం, కత్తి, ఆక్సిజన్ సినిమాల్లో నటించాడు. తాజాగా ఈ నటున్ని చెన్నై పోలీసులు అరెస్ట్ చేశారు. చెన్నైలో ఫోకర్ క్లబ్ లో గ్యాంబ్లింగ్ నిర్వహిస్తున్న శ్యామ్‌ను జూలై 27 రాత్రి కోడంబాకం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. క్లబ్ ముసుగులో శ్యామ్ గ్యాంబ్లింగ్‌ వ్యవహారాలకు పాల్పడుతున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. అనుమతులు లేకుండా ఫోకర్ క్లబ్‌లో పేకాట, బెట్టింగ్‌లకు పాల్పడుతున్నట్టు ప్రచారం జరుగుతుంది. దీనిపై పలు ఫిర్యాదులు రావడంతో.. పక్కా సమాచారంతో కోడంబాకం పోలీసులు ఫోకర్ క్లబ్‌పై దాడి చేసి శ్యామ్‌ను అరెస్ట్ చేసినట్టు తెలుస్తోంది. గతంలో పలు తెలుగు సినిమాల్లో నటించిన శ్యామ్‌కు ప్రస్తుతం టాలీవుడ్‌ సినిమాల్లో పెద్దగా అవకాశాలు లేవు. 

More Related Stories