మేనల్లుడు పేరుతో మోసాలు....తీవ్రంగా స్పందించిన సునీత

సినిమా నటుల పేర్లు చెప్పి మోసాలు చేయడం కొందరు మోసగాళ్ళకు పరిపాటిగా మారింది. తాజాగా తన మేనల్లుడిని అని చెబుతూ ఒక వ్యక్తి తన మోసాలకు పాల్పడుతున్నాడని ప్రముఖ సింగర్ సునీత ఆవేదన వ్యక్తం చేస్తూ ఓ వీడియో రిలీజ్ చేశారు. తనకు మేనల్లుడిని అంటూ ప్రచారం చేసుకుంటూ చైతన్య అనే ఓ కుర్రాడు కొందరి నుంచి డబ్బులు వసూళ్లు చేస్తున్నాడని చెబుతూ సునీత సోషల్ మీడియా వేదికగా స్పందించారు. తనకు అసలు చైతన్య అనే మేనల్లుడే లేడని, దయచేసి ఎవరూ అతని వలలో పడి మోసపోవద్దని కోరారు.ఈ సందర్భంగా సునీత మాట్లాడుతూ.. ‘‘నేను అందరికీ ఒక విషయంపై క్లారిటీ ఇవ్వదలుచుకున్నా, చైతన్య అనే అతను నా మేనల్లుడు అని చెప్పి, సెలబ్రిటీలతో పరిచయాలు పెంచుకుంటున్నాడట. అవకాశాలు ఇప్పిస్తానంటూ కొందరి దగ్గర డబ్బులు తీసుకుంటున్నాడని కూడా తెలిసింది. ఇది తెలిసి షాక్ అయ్యాను. నాకసలు చైతన్య అనే మేనల్లుడే లేడు. దయచేసి ఇకపై ఎవరూ మోసపోకండి. ఎవరూ మోసపోకూడదనే ఇలా వీడియో ద్వారా చెబుతున్నా" అని ఆమె పేర్కొంది.