English   

సరైన తల్లిదండ్రులకు పుట్టలేదేమో...షకీలా సంచలన కామెంట్స్ 

Shakeela 
2020-07-28 18:11:31

1980 మరియు 90ల్లో షకీలా సినిమా రిలీజ్ అవుతుందంటేనే కేరళలో పెద్ద హీరోలు కూడా తమ సినిమాలు రిలీజ్ ఆపేసుకుని వెనక్కి వెళ్ళే వారు. ఆమె సినిమాలకు అంత డిమాండ్ ఉండేది మరి. కానీ గత పదేళ్లుగా ఆమె అస్సలు సినిమాలు చేయడం లేదు. అయితే సొంత కుటుంబ సభ్యులే మోసం చేయడం వల్ల సంపాదించినదంతా చాలా వరకూ పోగొట్టుకున్నట్లు షకీలా చాలా ఇంటర్వ్యూలలో తెలిపింది. ఒకప్పుడు హీరోల స్థాయిలో పారితోషికం అందుకున్న షకీలాకు ఆస్తులు పోయి అప్పులే మిగిలాయి. అయినా సినిమాల మీద ఉన్న ఆసక్తితో చివరి ప్రయత్నం అంటూ మూడు సంవత్సరాల క్రితం లేడీస్ నాట్ అలోడ్ అనే సినిమాని నిర్మించింది. తనతో శీలవతి అనే సినిమాని తెరకెక్కించిన దర్శకుడు సాయి రామ్ దాసరి అనే కుర్రాడి దర్శకత్వంలో తెరకేక్కించింది. ఈ సినిమాకు సెన్సార్ రాకపోవడంతో చాలా కాలంగా కుస్తీలు పట్టిమ్ చివరికి కరోనా కారణంగా సినిమాలకు డిజిటల్ వేదికగా మంచి డిమాండ్ ఉందని భావించి తన సినిమాను ఓ స్పెషల్ సైట్ లో విడుదల చేసింది. 

తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో విడుదలయిన ఈ సినిమా గురించి తాజాగా షకీలా సంచలన కామెంట్స్ చేసింది. సినిమాకు పాజిటివ్ రెస్పాన్స్ వచ్చిందని, విమర్శకులు కూడా బాగుందన్నారని కానే సినిమాను పైరసీ చేసినట్లుగా తెలిసిందని పేర్కొంది. ఇది నా లైఫ్ అండ్ డెత్ సినిమాని ఎన్నో మార్లు చెప్పినా పైరసీ చేయడం దారుణమని మీకు సిగ్గు ఉందా కడుపుకు మీరు తినేది అన్నమేనా అని ఆమె తీవ్రంగా స్పందించింది. అసలే వడ్డీకి తీసుకుని సినిమా చేశానని, ఆ వడ్డీలు కట్టలేక ఈ సినిమాను ఇలా విడుదల చేశానని దీనిని కూడా మీరు పైరసీ చేశారంటే మీరు సరైన తల్లిదండ్రులకు పుట్టి ఉండరంటూ షకీలా తీవ్ర కామెంట్స్ చేసింది.  

More Related Stories