English   

సోనూ సూద్ మరో ముందడుగు.. సాయం కోసం టోల్ ఫ్రీ నెంబర్..

Sonu Sood
2020-07-29 07:20:02

రోజురోజుకు సోనూ సూద్ నిజంగానే దేవుడు అయిపోతున్నాడు. ఈయన చేసిన పనులు చూసి అందరూ ఆయనకు ఫ్యాన్స్ అయిపోతున్నారు. కష్టం అనే మాట వినిపిస్తే చాలు వెంటనే స్పందిస్తూ వాళ్లకు తనవంతు సాయం చేస్తున్నాడు సోను సూద్. గత మూడు నాలుగు నెలల నుంచి ఈయన చేస్తున్న మంచి పనులు చూసి దేశవ్యాప్తంగా సోనూసూద్ కు అభిమానులు పెరిగిపోతున్నారు. పలువురు రాజకీయ నాయకులు కూడా ఈయనపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. నువ్వు చేస్తున్న పనులు నిన్ను ఆ దేవుడు కూడా నిలబెడుతున్నాయి అంటూ అభిమానులు కూడా ఆయన వెంట నడుస్తున్నారు. తాజాగా తెలుగు రాష్ట్రాలలో కూడా సోనూ సూద్ మంచి పనులు కొనసాగుతున్నాయి. 

రైతుకు ట్రాక్టర్ ఇవ్వడం.. సాఫ్ట్ వేర్ ఉద్యోగికి ఆర్థిక సాయం అందించడం.. ఇవన్నీ చూసి ఇక్కడ కూడా ఆయనకు ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిపోతుంది. ఇదిలా ఉంటే ఇప్పుడు మరో అడుగు ముందుకు వేశాడు ఈ బాలీవుడ్ నటుడు. సాయం చేయడం అలవాటుగా కాదు ఏకంగా ఒక ఉద్యోగంగా భావిస్తున్నాడు. అందరినీ ఆదుకోవడం బాధ్యతగా ఫీల్ అవుతున్నాడు. అందుకే ఎవరికైనా కష్టం అనిపిస్తే ఈ టోల్ ఫ్రీ నెంబర్ కి ఫోన్ చేయండి అంటూ ఏకంగా ఒక నెంబర్ ఇచ్చేశాడు. ఫోన్ చేసి నీ కష్టం గురించి చెబితే చాలు సోను సూద్ టీం వచ్చి దాన్ని సాల్వ్ చేస్తుంది. ఆయన తీసుకున్న ఈ నిర్ణయం చూసి అందరూ షాక్ అవుతున్నారు. నువ్వు ఇంత మంచి వాడివి ఏంటి స్వామి అంటూ కాళ్లకు దండం పెడుతున్నారు. నిజమే కదా డబ్బులు చాలా మంది దగ్గర ఉంటాయి.. కానీ సాయం చేసే గుణం మాత్రం చాలా తక్కువ మంది దగ్గరే ఉంటుంది.

More Related Stories