సుశాంత్ కేసు కొత్త మలుపు.. గర్ల్ ఫ్రెండ్ రియాపై కేసు నమోదు

2020-07-29 07:33:08
సుశాంత్ సింగ్ ఆత్మహత్య కేసు మరో కొత్త మలుపు తీసుకుంది. సుశాంత్ మరణంపై ముంబయి పోలీసులు దర్యాప్తు చేస్తున్న వేళ... సుశాంత్ మృతిపై ఆయన తండ్రి కేకే సింగ్ పాట్నాలోని రాజేంద్రనగర్ పోలీసుల స్టేషన్ లో సుశాంత్ గర్ల్ ఫ్రెండ్ రియా చక్రవర్తిపై ఫిర్యాదు చేశారు. రియా చక్రవర్తితో పాటు మరికొందరిరు మోసం కుట్రకు పాల్పడటం ద్వారా సుశాంత్ ఆత్మహత్యకు కారణమయ్యారని కంప్లైంట్ లో పేర్కొన్నారు. కేకే సింగ్ ఫిర్యాదు మేరకు రియాతో పాటు మరో ఐదుగురి మీద సెక్షన్ 341 323 342 420 మరియు 406 కింద కేసు నమోదు చేశారు పాట్నా పోలీసులు. రియాపై ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పాట్నా పోలీసులు.. నలుగురు పోలీసుల్ని ముంబయికి పంపించబోతున్నారు. వారు సుశాంత్ డైరీలో వివరాలతో పాటు.. ముంబయి పోలీసుల నుంచి కావాల్సిన సమాచారాన్ని సేకరించి.. ఆ తర్వాత తుది నిర్ణయం తీసుకుంటారు.