English   

రాంగోపాల్ వర్మపై కేసు నమోదు

Ram Gopal Varma
2020-07-29 07:47:04

రాంగోపాల్ వర్మపై మరో కేసు నమోదైంది. వర్మపై నాయి బ్రహ్మణ సంఘం నాయకులు రాజోలు పోలీస్ స్టేషన్‌లో కేసు పెట్టారు. ఇటీవల ఓ టీవీ ఛానెల్ ఇంటర్వ్యూలో పాల్గొన్న రాంగోపాల్ వర్మ.. నాయి బ్రాహ్మణుల మనోభావాలను కించపరిచే విధంగా మాట్లాడారంటూ నాయి బ్రహ్మణ సంఘం ప్రతినిధులు రాజోలులో పోలీసులకు ఫిర్యాదు చేశారు. నాయి బ్రాహ్మణ సంఘం ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఆయన తెరకెక్కించిన పవర్ స్టార్ మూవీ ఇటీవలే ఆర్జీవీ థియేటర్ పోర్టల్ లో విడుదల కాగా.. తాజాగా మర్డర్ మూవీ ట్రైలర్ విడుదలైంది. మారుతి రావు, అమృత, ప్రణయ్‌ల రియల్ స్టోరీ ఆధారంగా తెరకెక్కించిన ఈ సినిమాపై కూడా అమృత, ప్రణయ్ తండ్రివైపు నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది.

More Related Stories