English   

దుల్క‌ర్ స‌ల్మాన్‌...యుద్ధంతో రాసిన ప్రేమ‌క‌థ‌ 

Dulquer Salmaan
2020-07-29 07:59:03

మ‌హాన‌టిలో ఓ కీల‌క పాత్ర పోషించిన దుల్క‌ర్ తో ఓ ప్రాజెక్టు చేయ‌డానికి వైజ‌యంతీ మూవీస్ ఒప్పందం కుదుర్చుకుంది. ఎట్ట‌కేల‌కు.. ఆ సినిమా ఇప్పుడు ప‌ట్టాలెక్క‌బోతోంది. తెలుగు, త‌మిళ, మ‌ల‌యాళ భాష‌ల్లో ఈ సినిమా రూపొంద‌నుంది. హ‌ను రాఘ‌వ‌పూడి ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్నారు.దుల్క‌ర్ స‌ల్మాన్‌ పుట్టిన రోజు సంద‌ర్భంగా ఈ సినిమా కాన్సెప్ట్ పోస్ట‌ర్‌ను చిత్ర యూనిట్ విడుద‌ల చేసింది. ఇందులో ఓ యువ‌కుడు, యువ‌తి చేయి ప‌ట్టుకుని ఉన్నాడు. `లెఫ్ట్‌నెంట్ రామ్‌` అంటూ దుల్క‌ర్ పాత్ర‌ని ప్రేక్ష‌కుల‌కు ప‌రిచ‌యం చేశారు. `యుద్ధంతో రాసిన ప్రేమ‌క‌థ‌` అంటూ ట్యాగ్ లైన్ ఇచ్చారు.1964 నేప‌థ్యంలో తెర‌కెక్కే పీరియాడిక‌ల్ ల‌వ్‌స్టోరి ఇది. విశాల్ చంద్ర శేఖర్ సంగీతమందిస్తున్నారు.

More Related Stories