సీరియస్ కండిషన్ లో నటుడు...ఆర్ధిక సహాయం కోసం ఎదురుచూపులు

కరోనా అందరి జీవితాలను చిన్నభిన్న్నం చేసింది. గౌరవంగా పని చేసుకుని పొట్ట పోసుకునే వాళ్ళు సైతం దీని వలన బిచ్చగాల్లుగా మారే పరిస్థితి. అయితే తాజాగా ఓ టీవీ నటుడు ఆసుపత్రి పాలయ్యాడు. హిందీ సీరియల్స్ లో నటించే నటుడు అనుపమ్ శ్యామ్ ముంబైలోని ఆసుపత్రిలో చేరారని తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన ఐసీయూలో ఉన్నాడని, చికిత్సకు తమ వద్ద డబ్బులు లేవని ఆయన చికిత్స కోసం ఆర్థిక సాయం చేయడానికి దాతలు ముందుకు రావాలని అనుపమ్ సోదరుడు అనురాగ్ విజ్ఞప్తి చేశాడు. కొంతకాలంగా కిడ్నీ సంబంధిత సమస్యతో బాధపడుతున్న అనుపమ్ మొన్న రాత్రి డయాలసిస్ చేయించిన తర్వాత ఒక్కసారిగా కుప్పకూలిపోవడంతో ముంబైలోని లైఫ్లైన్ ఆసుపత్రిలో జాయిన్ చేశారని తెలుస్తోంది.
అనుపమ్ ఆరోగ్యంపై ఆయన సోదరుడు చెబుతున్న దాన్నీ బట్టి ఆయన గత ఆరు నెలలుగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. కిడ్నీలో ఇన్ఫెక్షన్ రావడంతో ఎప్పటికప్పుడు అతనికి డయాలసిస్ చేయించాలని వైద్యులు సూచించారు. కానీ అది బాగా ఖర్చుతో కూడుకున్న వ్యవహారం కావడంతో ఆయుర్వేద చికిత్స తీసుకున్నా అది పనిచేయలేదు. చివరికి మళ్ళీ డయాలసిస్ చేయిస్తే అది బెడిసి కొట్టింది. మొన్న డయాలసిస్ చేయగా వెంటనే ఆయన కుప్పకూలిపోయాడని తెలుస్తోంది. ఆయన సంపాదించిందంతా ఆయన మందుల ఖర్చులకే సరిపోయిందని ఎవరైనా ముందుకు వచ్చి డబ్బు సహాయం చేసేలా చూడాలని ఆయన సోదరుడు కోరుతున్నాడు. ఇక శ్యామ్ వైద్యానికి డబ్బు సాయం చేయాలని బాలీవుడ్ స్టార్స్ కు రియల్ హీరో అనిపించుకుంటున్న సోనుసూద్లకు ట్విటర్ యూజర్లు ట్యాగ్ చేస్తున్నారు.