మీ తండ్రెవరో తెలియదనుకుంటా.. అమితాబ్ ఘాటు వ్యాఖ్యలు

కరోనా ఎవరినీ వదలడం లేదు. పెద్ద చిన్నా తేడాలేకుండా అందరినీ సోకుతోంది. బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ కరోనా బారిన పడ్డాడన్న సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ప్రకటించాడు కూడా. ఇక ఈయనతో పాటు తనయుడు అభిషేక్ బచ్చన్ కు కూడా కరోనా పాజిటివ్ రాగా అంతా ఒకే ఇంట్లో ఉండటంతో తండ్రి నుంచి కొడుకుకు కూడా కరోనా సోకింది. మరో వైపు కుటుంబంలో అంతా టెస్టులు చేయించుకున్నారు. ఐశ్వర్య రాయ్ బచ్చన్, జయా బచ్చన్ తో పాటు అమితాబ్ కూతురు శ్వేతా బచ్చన్, మనవడు అగస్త్య నందా, మనవరాలు నవ్య నివేలి కూడా టెస్టులు చేయించుకున్నారు. వాళ్లలో ఐశ్వర్య రాయ్ కు ఆమె కూతురు ఆరాధ్యకు కూడా పాజిటివ్ అని తేలింది. అమితాబ్ ఇప్పటికీ ఆస్పత్రిలోనే చికిత్స పొందుతున్నారు. తన ఆరోగ్య సమాచారాన్ని ఎప్పటికప్పుడూ బిగ్‌బీ ట్విటర్ ద్వారా వెల్లడిస్తున్నారు. అయితే ఐశ్వర్య, ఆరాధ్యలు నెగటివ్ రావడంతో డిశ్చార్జ్ అయ్యారు. అయితే కరోనాతో అమితాబ్ చనిపోవాలని కొందరు ట్విట్టర్లో హెట్ మెసేజ్ లు స్ప్రెడ్ చేస్తున్నారు. ఈ విషయం బిగ్ బీ దృష్టికి రావడంతో ఆయన వీటికి దీటుగా జవాబిచ్చారు. ‘మీరు కనీసం మీ తండ్రి పేరూ చెప్పుకోలేదు. మీ తండ్రెవరో తెలియదనుకుంటా’ అని రిైప్లె ఇచ్చారు.