English   

ఇంట్లో నుండి మిస్సయిన రియా...సుప్రీం కోర్టుకు 

Rhea Chakraborty
2020-07-30 09:32:42

బాలీవుడ్‌ నటుడు సుశాంత్‌సింగ్‌ రాజ్‌పుత్‌ ఆత్మహత్య బాలీవుడ్‌లో సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. తాజాగా ఆయన మృతి కేసు అనేక మలుపులు తిరుగుతోంది. సుశాంత్ మరణానికి అతని గర్ల్‌ఫ్రెండ్‌ రియా చక్రవర్తే కారణమంటూ బీహార్‌ రాజధాని పాట్నాలో పోలీసులకు సుశాంత్ తండ్రి ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఈ మేరకు ఆమెపై పోలీసులు కేసు నమోదు చేశారు. దీంతో రియా చక్రవర్తి బుధవారం సుప్రీం కోర్టు తలుపుతట్టారు. 

పాట్నాలో తన మీద నమోదైన ఎఫ్‌ఐఆర్‌ను ముంబైకి బదిలీ చేయాలని కోరారు. రెండు వేర్వేరు రాష్ట్రాల పోలీసులు ఒక కేసును దర్యాప్తు చేయలేరన్న ఆమె సుశాంత్‌ మృతిపై ఇప్పటికే విచారణ ముంబైలో కొనసాగుతున్నప్పుడు.. అదే ఘటనకు సంబంధించి బీహార్‌లో కేసు వేయడం చట్టవిరుద్ధమని రియా తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. 

సుశాంత్ తండ్రి రియా జూన్‌ 8న సుశాంత్‌ నగదు, నగలు, ల్యాప్‌టాప్‌, క్రెడిట్‌ కార్డులను తనతో తీసుకువెళ్లిందని రియాపై ఆరోపణలు చేశారు. ఈ క్రమంలో తనను అరెస్టు చేస్తారనే భయంతో కోర్టును ఆశ్రయించినట్లు తెలుస్తోంది. పాట్నా నుంచి న‌లుగురు పోలీసుల బృందం రియాను విచారించేందుకు నిన్న ముంబైకి రాగా రియా చ‌క్ర‌వ‌ర్తి ఇంట్లో క‌నిపించ‌కుండా..అదృశ్యమ‌వ‌డం చ‌ర్చ‌నీయాంశ‌మైంది.  మ‌రోవైపు తాజా ప‌రిణామాల నేప‌థ్యంలో ముంద‌స్తు బెయిల్ తీసుకునే ఉన్న‌ట్టు క‌థ‌నాలు వ‌స్తున్నాయి. 

More Related Stories