English   

మెగా డాటర్ ఎంగేజ్మెంట్ డేట్ ఫిక్స్

Niharika Konidela
2020-07-30 17:51:18

చానాళ్ళ తరువాతా మెగా కుటుంబంలో పెళ్ళి సందడి మొదలైంది. మెగాస్టార్ చిరంజీవి పెద్ద తమ్ముడు నాగబాబు కూతురు నిహారిక త్వరలో పెళ్లిపీటలు ఎక్కబోతోంది. మొన్న ఆమె ఇన్‌స్టాగ్రామ్ ద్వారా త్వ‌ర‌లో పెళ్లి పీట‌లు ఎక్క‌నున్న‌ట్టు కాఫీ కప్‌ తో చిన్న హింట్ ఇచ్చి తాను పెళ్లాడబోయేది ఎవరనేది ఆమె క్లారిటీ ఇచ్చేసింది. సోషల్ మీడియాలో బాగా ఫేమస్ అయిన అతని పేరు చైతన్య, గుంటూరు ఐజీ జొన్నలగడ్డ ప్రభాకర్ రావు తనయుడు. నిహారిక అతనితో ఉన్న పిక్ పోస్ట్ చేస్తూ అతన్ని ట్యాగ్ కూడా చేసి జనానికి పరిచయం అయింది. దీంతో ఒక్కసారిగా అతనికి కూడా ఫాలోవర్స్ వెల్లువలా వచ్చి పడ్డారు. ఇక బిట్స్ పిలానీలో చదువుకున్న అయన ప్రస్తుతం టెక్ మహీంద్రా సంస్థలో పెద్ద హోదాలో ఉన్నాడు. హీరోయిన్ గా రెండు మూడు సినిమాలు చేసి సైలెంట్ అయిన నిహారిక ప్రస్తుతం వెబ్ సిరీస్ మీద ద్రుష్టి పెట్టింది. 

ఇక తన సోషల్ మీడియా అకౌంట్ లో చైతన్య కూడా NisChay అని కామెంట్ చేస్తూ ఇద్దరి పిక్ షేర్ చేయడంతో వీరి పెళ్ళికి కన్ఫర్మేషన్ వచ్చినట్టయ్యింది. ఇక వీరి నిశ్ఛి తార్ధ కార్యక్రమం ఆగస్టు నెలలో జరగనుందని అప్పట్లోనే అన్నారు. అయితే తాజా సమాచారం మేరకు నిహారిక- చైతన్య నిశ్చితార్ధ వేడుకకు ముహూర్తం ఖరారు అయినట్టు తెలుస్తోంది. ఆగస్టు 13న హైదరాబాద్ లో వీరి నిశ్చితార్ధ వేడుక జరగనుందని అంటున్నారు. కోవిడ్ నిభందనల ప్రకారం కేవలం కుటుంబ సభ్యులు మరియు సన్నిహితులు హాజరుకానున్నారు. అనంతరం పెళ్లి వేడుకను గ్రాండ్ గా నిర్వహించనున్నారని తెలుస్తోంది.  

More Related Stories