English   

నిర్మాతలకి, ప్రేక్షకులకి మరో షాక్ ఇచ్చిన కేంద్రం 

Central Government
2020-07-30 18:30:49

నిన్న ఆగష్టు నెలకి సంబందించిన లాక్ డౌన్ మార్గదర్శకాలు రిలీజ్ చేసింది కేంద్రం. కరోనా కారణంగా గత నాలుగు నెలలుగా దేశ వ్యాప్తంగా అన్ని థియేటర్స్ మూత పడిన సంగతి తెలిసిందే కదా. నాలుగు నెలలుగా మూత పడ్డ థియేటర్స్‌, మల్లీప్లెక్స్ లు తెరుచుకుంటాయని భావిస్తున్న ఆశల మీద కేంద్రం నీళ్లు చల్లినట్టు అయింది. కంటైన్మెంట్ జోన్ల వెలుపల అన్ని కార్యకలాపాలకు అనుమతిచ్చిన ప్రభుత్వం నిమా హాళ్లు, ఈత కొలనులు, ఎంటర్టైన్మెంట్ పార్కులు, సినిమా హాళ్లు, బార్లు, ఆడిటోరియంలు, సమావేశమందిరాలు, ఇలాంటి ఇతర కార్యకలాపాలకు అనుమతి లేదని చెప్పింది. రాజకీయ, క్రీడలు, వినోదం, విద్యా, సాంస్కృతిక, మతపరమైన సమావేశాలకు అనుమతి లేదని, పరిస్థితిని సమీక్షించుకొని, ఈ కార్యకలాపాలను ఎప్పటి నుంచి అనుమతించాలో తర్వాత ప్రత్యేకంగా నిర్ణయం తీసుకోవడం జరుగుతుందని పేర్కొంది. అయితే ఆగష్టు 5 నుంచి మాత్రం జిమ్స్, యోగా సెంటర్లను ఓపెన్ చేసుకోవడానికి అనుమతులు ఇచ్చింది. అలానే రాత్రి పూట కర్ఫ్యూ కూడా ఆగష్టు 5 నుండి పూర్తిగా ఎత్తివేసినట్టు తెలిపింది. 

More Related Stories