English   

మెగా ఫ్యామిలీని కలవరపెడుతున్న కరోనా.. కారణం ఇదే..

 Corona worry
2020-07-31 02:37:20

అవును.. ఇప్పుడు నిజంగానే మెగా కుటుంబాన్ని కరోనా వైరస్ కలవరపెడుతోంది.. అదేంటి ఆ కుటుంబం అంతా సేఫ్ గానే ఉంది కదా అనుకుంటున్నారా. అంతా బాగానే ఉన్నారు.. కానీ త్వరలోనే నిహారిక ఎంగేజ్మెంట్ కు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో కరోనా ఏ మాత్రం జాలి కరుణ లేకుండా విరుచుకుపడుతుంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో రోజుకు 10 వేల కేసులు వస్తున్నాయి అంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇలాంటి సమయంలో నిహారిక నిశ్చితార్థం ఏర్పాటు చేస్తున్నారు మెగా ఫ్యామిలీ. గుంటూరు ప్రభుత్వ అధికారి ప్రభాకర్ కొడుకు చైతన్య జొన్నలగడ్డతో నిహారిక పెళ్లి నిశ్చయమైంది. ఆగస్టు 13న నిశ్చితార్థ వేడుక జరపాలని చూస్తున్నారు ఇరు కుటుంబాలు. ఈ క్రమంలోనే వేడుకలు చాలా సింపుల్ గా జరపాలని ఆలోచిస్తుంది మెగా ఫ్యామిలీ.

అయితే ఎంత జాగ్రత్తగా ఉన్నా కూడా కచ్చితంగా స్నేహితులతో పాటు ఇరు కుటుంబాల నుంచి కొందరు బంధువులు హాజరవుతారు. అలాంటి వాళ్ల నుంచి పూర్తిగా జాగ్రత్త పడాలని చూస్తుంది మెగా కుటుంబం. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కూడా ఏదో ఒక వైపు నుంచి ఈ వైరస్ అటాక్ చేస్తూనే ఉంది. అందుకే నిహారిక ఎంగేజ్మెంట్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మరీ ముఖ్యంగా మెగా కుటుంబంలో 60 ఏళ్ల వయసు పైబడిన వాళ్ళు ముగ్గురు ఉన్నారు. చిరంజీవి అమ్మగారు అంజనా దేవితో పాటు చిరంజీవి, నాగబాబు కూడా ఆరుపదుల వయసు దాటారు. అందుకే ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉన్నారు. నిశ్చితార్థం కేవలం అతికొద్ది సన్నిహితుల మధ్యలోనే తతంగం పూర్తి చేయాలని చూస్తున్నారు. కావాలంటే పరిస్థితులు చక్కబడ్డాక గ్రాండ్ గా పార్టీ ఇవ్వాలని ప్లాన్ చేస్తుంది మెగా ఫ్యామిలీ. 

More Related Stories