English   

బాలీవుడ్ లో మరో యువ నటుడు ఆత్మహత్య..

Actor Ashutosh Bhakre
2020-07-31 08:24:18

2020లో ఏం జరుగుతుందో ఎవరికీ అర్థం కావడం లేదు. ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీకి ఈ ఏడాది అస్సలు కలిసి రావడం లేదు. అందులోనూ బాలీవుడ్ అయితే ఎంతో మంది నటులను కోల్పోయింది. రిషి కపూర్, ఇర్ఫాన్ ఖాన్, సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఇలా చెప్పుకుంటూ పోతే చాలా మంది నటులు ఈ సంవత్సరం కన్నుమూశారు. తాజాగా మరో యువ నటుడు కూడా ఆత్మహత్య చేసుకోవడం అందరినీ కలిచివేసింది. మరాఠీ సినీ నటుడు అశుతోష్ భక్రే జూలై 29న ఆత్మహత్య చేసుకున్నాడు. ఈయన వయసు కేవలం 32 సంవత్సరాలు మాత్రమే. ఈ ఏడాది  ఇది దాదాపు 10 మంది బాలీవుడ్ నటులు ఆత్మహత్య చేసుకున్నారు. అందులో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ కూడా ఉన్నాడు. ఇప్పుడు అశుతోష్ రాఠ్వాడ ప్రాంతంలోని నాందేడ్‌లోని తన నివాసంలో ఉరి వేసుకున్నట్లు తెలుస్తోంది. కొన్ని రోజులుగా డిప్రెషన్‌తో బాధ పడుతున్నాడు.

ఈయన చనిపోవడానికి కారణం ఇదేనా.. మరేదైనా ఉన్నాయా అని పోలీసులు ఆరా తీస్తున్నారు. ఒక వ్యక్తి తమ ప్రాణాలను ఎందుకు తీసుకుంటారో విశ్లేషించే వీడియోను అశుతోష్ భక్రే చనిపోయే ముందు సోషల్ మీడియాలో పోస్ట్‌ చేశాడు. దాంతో కేసులో మరింత ఆసక్తికరమైన విషయాలు బయటకు వస్తున్నాయి. ప్రస్తుతానికి ఆయన మరణం ప్రమాదవశాత్తు జరిగింది అంటూ పోలీసులు కేసు ఫైల్ చేశారు. ప్రముఖ మరాఠీ టెలివిజన్ నటి మయూరి దేశ్‌ముఖ్‌ను అశుతోష్ భక్రే 2016లో వివాహం చేసుకున్నాడు. 2013 చిత్రం భకార్‌తో అశుతోష్ భక్రేకు గుర్తింపు లభించింది. అక్కడి నుంచి ఆయన  టెలివిజన్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు. బాలీవుడ్ హీరో సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ చనిపోయినప్పుడు ఒక వ్యక్తి ఎలాంటి పరిస్థితుల్లో ఆత్మహత్య చేసుకున్నాడో తెలియకుండా అతని గురించి మాట్లాడటం తప్పని సుశాంత్‌కు సపోర్టు చేస్తూ మయూరి ఒక లెటర్‌ను సోషల్‌ మీడియాలో కూడా పోస్ట్‌ చేసింది. ఇప్పుడు ఆమె భర్త ఆత్మహత్య చేసుకోవడం అభిమానులను కన్నీరు పెట్టిస్తోంది.

More Related Stories