టాలీవుడ్ రైటర్ ప్రసన్న కుమార్ పెళ్లి.. కేవలం కొద్ది మంది సమక్షంలోనే..

జబర్దస్త్ కామెడీ షో తెలుగు సినిమాకు ఎంతో మంది ప్రముఖులను అందించింది. కమెడియన్ లతో పాటు టెక్నీషియన్స్ ని కూడా జబర్దస్త్ టాలీవుడ్ కు అందించింది. అందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సిన వాడు ప్రసన్న కుమార్. తెలుగు ఇండస్ట్రీలో ప్రస్తుతం ఉన్న యంగ్ సెన్సేషనల్ రైటర్స్ లో ప్రసన్న కూడా ఒకడు. ఇప్పటికే సినిమా చూపిస్తా మామ, నేను లోకల్, హలో గురూ ప్రేమ కోసమే లాంటి సినిమాలకు కథ మాటలు అందించాడు ప్రసన్న. ఈయన ప్రస్థానం జబర్దస్త్ లో మొదలైంది. అప్పట్లో ధనరాజ్ టీంలో ఆటో రాంప్రసాద్ తో పాటు చేసేవాడు. తర్వాత ఆయన సినిమాల్లోకి వచ్చాడు. సినిమా చూపిస్త మామతో ఫస్ట్ బ్రేక్ అందుకున్నాడు. అందులో అద్భుతమైన డైలాగ్స్ రాసి కెరీర్ కు గట్టి పునాది వేసుకున్నాడు. ఆ వెంటనే త్రినాధ రావు దర్శకత్వంలో వచ్చిన నేను లోకల్, హలో గురూ ప్రేమకోసమే సినిమాలతో స్టార్ రైటర్ అయ్యాడు. ప్రస్తుతం వరస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఈయన పెళ్లి సన్నిహితుల సమక్షంలోనే జరిగింది. జబర్దస్త్ నటీనటులు కూడా ఈ వేడుకకు వచ్చారు.