English   

వర్మ థ్రిల్లర్ ట్రైలర్.. అప్సర రాణి అందాల విందు..

RGV Thriller
2020-07-31 09:11:25

అగ్గిపుల్ల.. సబ్బుబిల్ల.. కుక్కపిల్ల కాదేదీ కాదు కవితకు అనర్హం అన్నారు మహాకవి శ్రీశ్రీ. ఇప్పుడు వర్మను చూస్తుంటే ఇదే అనిపిస్తుంది. లాక్ డౌన్ కారణంగా అంతా ఇంట్లోనే లాక్ అయిపోతే ఈయన మాత్రం తన పని తాను చేసుకుంటున్నాడు. అసలు ఎక్కడ్నుంచి షూటింగ్ చేస్తున్నాడు.. ఎలా చేస్తున్నాడు అనేది కూడా ఎవరికీ అర్థం కావడం లేదు. అప్పుడే సినిమాలను సిద్ధం చేసాడు. ట్రైలర్స్ కూడా విడుదల చేస్తున్నాడు. ఇప్పటికే క్లైమాక్స్, పవర్ స్టార్ నేక్డ్ లాంటి సినిమాలు చేసి ఆన్ లైన్ లోనే విడుదల చేసి సొమ్ము చేసుకున్నాడు వర్మ. ఇప్పుడు మరో సినిమా కూడా ట్రైలర్ కూడా విడుదల చేసాడు. దాని పేరు థ్రిల్లర్. ఈ సినిమాను కూడా పూర్తి చేసాడు.. త్వరలోనే విడుదల చేస్తున్నానని చెప్పాడు ఈ దర్శకుడు.

ఈ ట్రైలర్ అంతా హీరోయిన్ అప్సర రాణి అందాల చుట్టూ మాత్రమే పెరిగింది. ఆమెకు ఒక చిన్న డ్రాయర్ వేసి కెమెరా మొత్తం అక్కడే పెట్టాడు వర్మ. ఈ మేకింగ్ చూసి వర్మ అభిమానులు అయ్యో పాపం అనుకుంటున్నారు. వర్మ ఇలాంటి సినిమాలు ఎందుకు తీస్తున్నాడు అంటూ అభిమానులు వాళ్ళలో వాళ్లే మౌనంగా రోదిస్తున్నారు. మొత్తానికి వర్మ చేస్తున్న సినిమాలు చూసి అంతా షాక్ అవుతున్నారు. అసలు ఈయనకు ఇలాంటి ఆలోచనలు ఎలా వస్తున్నాయి.. ఇంత వేగంగా సినిమాలు ఎలా చేస్తున్నాడంటూ అంతా ముక్కున వేలేసుకుంటున్నారు. ఈయన్ని ఇలాగే వదిలేస్తే నెలకు కాదు.. వారానికి ఓ సినిమా చేసి ఆన్ లైన్ రిలీజ్ చేస్తాడు ఆర్జీవీ.  

More Related Stories