English   

ఘర్షణకు సీక్వెల్ రావాలి అంటున్న రానా

Rana
2020-07-31 12:02:32

విక్టరీ వెంకటేష్ హీరోగా గౌతమ్ మీనన్ దర్శకత్వంలో వచ్చిన బ్లాక్ బాస్టర్ సినిమా ఘర్షణ. తమిళంలో సూర్య హీరోగా వచ్చిన కాక్క కాక్క సినిమాకు రీమేక్ గా వచ్చిన ఈ సినిమా టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ వద్ద మంచి వసూళ్లను రాబట్టింది. ఈ సినిమాలో డీసీపీ రామచంద్రగా వెంకటేష్ స్టైలిష్ పోలీస్ ఆఫీసర్ గా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాడు. ఈ సినిమా విడుదలై నిన్నటికి 16 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ విషయాన్ని సురేష్ ప్రొడక్షన్స్ గుర్తు చేస్తూ ట్వీట్ చేశారు. దీనిని యువహీరో రానా రీ ట్వీట్‌ చేశారు. అలానే కామెంట్ చేస్తూ ‘మీలో ఎంతమంది ఈ చిత్రానికి సీక్వెల్‌ను కోరుకుంటున్నారు. నేను కోరుకుంటున్నా’ అని కామెంట్ చేశారు. నిజానికి ఇక ఈ సినిమాకు గౌతమ్ మీనన్ సీక్వెల్ ప్లాన్ చేస్తున్నాడని ఆ మధ్య వార్తలు వచ్చాయి.  గౌతమ్ మీనన్ సీక్వెల్ తీస్తే నటియించాడనికి సిద్ధంగా ఉన్నానని తమిళ్ కాఖా కాఖా హీరోయిన్ జోతిక చెప్పుకొచ్చింది. `పోన్మగల్ వంధల్` ప్రమోషన్స్ లో భాగంగా ఇన్ స్టాగ్రామ్ లైవ్ చాట్ సెషన్ లో ఈ సంగతి వెల్లడించింది జ్యోతిక.

More Related Stories