ఈ సమయంలో కూడా గట్టిగానే రేట్ పెంచేసిన పూజ

తెలుగులో ఇప్పుడు పూజ హెగ్డే ఒక రేంజ్ లో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. స్టార్ హీరోలతో సినిమాలు .. వరుస బ్లాక్ బస్టర్లు పూజ కెరియర్ కు బాగా కలిసి వస్తున్నాయి. తెలుగులో ఆమె స్పీడ్ చూసి తమిళం నుంచి .. హిందీ నుంచి కూడా ఆమెను అవకాశాలు వెతుక్కుంటూ వస్తున్నాయి. మొన్ననే అల వైకున్తపురమిలో అనే సినిమా చేసి బంపర్ హిట్ అందుకున్న ఈ భామ పారితోషకం భారీగా పెంచినట్టు చెబుతున్నారు. అయినా ఆమె ఉంటే సినిమా హిట్ అనే సెంటిమెంట్ ఏర్పడంతో టాలీవుడ్ దర్శక నిర్మాతలు ఆమె డేట్స్ కోసం ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం చేస్తున్న 'మోస్ట్ ఎలిజబుల్ బ్యాచ్ లర్' సినిమా కోసం కూడా పూజ భారీ పారితోషికాన్ని తీసుకుందని అంటున్నారు. సాధారణంగా హీరోయిన్ కంటే హీరోకి పారితోషికం ఎక్కువగా ఉంటుంది. కానీ ఈ సినిమా కోసం అఖిల్ కంటే పూజ హెగ్డే అందుకున్న పారితోషికం ఎక్కువనే చర్చ సాగుతోంది.
ఆ విషయం పక్కన పెడితే డీజే, అరవింద సమేత వీర రాఘవ, మహర్షి, గద్దలకొండ గణేశ్, అల వైకుంఠపురంలో..ఇలా పూజా హెగ్డే నటించిన ప్రతీ సినిమా బాక్సాపీస్ వద్ద మంచి టాక్ తెచ్చుకున్నాయి. అందుకే దీపం ఉన్నపుడే ఇల్లు చక్కబెట్టుకోవాలనే నానుడిని ఫాలో అవుతున్న పూజా తన రెమ్యునరేషన్ ను పెంచేసిందని అంటున్నారు. అల వైకుంఠపురంలో సినిమాకి 1.40 కోట్లు తీసుకున్న పూజా..ప్రస్తుతం రూ.2 కోట్లు పారితోషికం డిమాండ్ చేస్తోన్నట్టు ఫిలింనగర్ లో ప్రచారం జరుగుతోంది. ఇక ప్రస్తుతం ప్రభాస్ తో రాధే శ్యామ్, అఖిల్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాలు చేస్తూ బిజీగా ఉంది ఈ భామ.