సుశాంత్ సింగ్ రాజ్ పుత్ చావుకు రియా చక్రవర్తి కారణం అంటున్న అంకిత..

బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య కేసు ఒక్కోరోజు ఒక్కో మలుపు తిరుగుతుంది. ఇన్ని రోజులు ఇది కేవలం ఆత్మహత్య గానే అందరూ భావించారు. కానీ ఇప్పుడు సుశాంత్ తండ్రితో పాటు అతని మాజీ ప్రియురాలు అంకిత కూడా న్యాయం జరుగుతోంది అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం హాట్ టాపిక్ గా మారింది. దానికి తోడు బాలీవుడ్ హీరోయిన్ రియ చక్రవర్తిపై కూడా సంచలన ఆరోపణలు చేసింది అంకిత. ముఖ్యంగా సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ని ఆమె మానసికంగా క్షోభకు గురి చేసిందని.. ఆమె వల్ల సుశాంత్ నరకం చూశాడని అంతా ఆరోపించడం సంచలనంగా మారుతుంది. అంతే కాదు ఏడాది కింద రియా వల్ల తాను చాలా మానసిక సంఘర్షణకు లోనవుతున్నట్లు సుశాంత్ తనకు చెప్పి ఏడ్చాడని అంకిత చెబుతుంది.
దానికి తోడు అతని ఆర్థిక వ్యవహారాలు కూడా రియా చక్రవర్తి చూడటం పలు అనుమానాలకు తావిస్తోంది. వీలైనంత త్వరగా ఆమె నుంచి విడిపోవడానికి ప్రయత్నిస్తున్నట్లు సుశాంత్ సింగ్ తనతో చెప్పాడని అంకిత కామెంట్ చేసింది. మరోవైపు సుశాంత్ తండ్రి కేకే సింగ్ కూడా రియా చక్రవర్తిపైనే తనకు అనుమానాలు ఉన్నాయని చెబుతున్నాడు. ఈ క్రమంలోనే అంకిత కూడా ఇదే ఆరోపణలు చేయడం ఆసక్తికరంగా మారింది. దానికి తోడు సుశాంత్ సింగ్ చనిపోయిన తర్వాత అతడు ఇంటికి రెండుసార్లు వెళ్ళింది అంకిత. హీరో అక్క శ్వేతా సింగ్ ను కూడా కలిసింది. మొత్తానికి అంకిత ఆరోపణలు సుశాంత్ సింగ్ కేసులో కొత్త అనుమానాలకు తెర తీస్తున్నాయి.