English   

శేఖర్ కమ్ముల ఇంట తీవ్ర విషాదం

sekhar kammula
2020-08-01 11:37:18

దర్శకుడు శేఖర్ కమ్ముల ఇంట తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఆయన తండ్రి శేషయ్య ఈరోజు అనారోగ్య కారణాలతో మృతి చెందినట్టు చెబుతున్నారు. అయితే ఆయన మృతి గురించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఆయన చివరిగా శేఖర్ కమ్ముల తెరకెక్కిస్తున్న నాగ చైతన్య- సాయి పల్లవి క్రేజీ కాంబినేషన్ మూవీ ఓపెనింగ్ కి వచ్చారు. ఈ సినిమా ఓపెనింగ్ సమయంలో క్లాప్ ఇచ్చారు. ఈ సినిమాని ఏమిగోస్ క్రియేషన్స్ సమర్పణలో శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ ఎల్ పి బ్యానర్ పై నారాయణ్ దాస్ కె నారంగ్, పి రామ్మోహన్ రావు నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఈ పాటికి రిలీజ్ కావాల్సి ఉన్నా కరోనా కారణంగా ఈ సినిమా షూటింగ్ ఇంకా పూర్తి కాలేదు. అయితే కరోనా విజ్రుంభిస్తున్న తరుణంలో ఆయన మృతి విషయం మీద శేఖర్ కమ్ముల ద్వారా అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.

More Related Stories