English   

అప్పుడే పెళ్లి చేసుకుంటా...కియారా కామెంట్స్

kiara Advani
2020-08-01 16:55:37

ప్రస్తుతం బాలీవుడ్‌లో ఉన్న క్రేజీ హీరోయిన్లలో కియారా అద్వానీ ఒకరు. నటన, గ్లామర్ రెండూ సమపాళ్లలో ఉన్న ఈ బ్యూటీ విభిన్న పాత్రలు చేస్తూ ముందుకు వెళ్తోంది. అయితే కెరీర్ మంచి పీక్స్ లో ఉన్నప్పుడు ఆమె చేసిన లస్ట్ స్టోరీస్ లాంటి సబ్జెక్ట్స్ వేరే ఎవరూ అయితే ఒప్పుకోరు, కానీ ఆమె నటించేసి ఆశ్చర్య పరించింది. అయితే తన పేరు గురించి ఎవరికీ తెలియని ఒక విషయాన్ని వెల్లడించింది ఈ భామ. అదేంటంటే అసలు తన పేరు కియారా కాదట. అలియా అద్వానీ అట. నిన్న ఆమె తన 28వ జన్మదినోత్సవాన్ని జరుపుకుంది. 

ఈ సందర్భంగా కెరీర్‌తో పాటు తన వ్యక్తిగత జీవితం గురించి ఆసక్తికరమైన విషయాల్ని వెల్లడించింది. తన తల్లితండ్రులు ప్రేమ పెళ్లి చేసుకున్నారని ఒకరినొకరు పూర్తిగా అర్ధం చేసుకున్నారని చెప్పుకొచ్చింది. భవిష్యత్తులో ఒకవేళ తను ప్రేమలో పడితే ఆ బంధాన్ని చాలా ఏళ్లు కొనసాగించి..ఆ తర్వాతే పెళ్లి గురించి ఆలోచిస్తానని ఒక ఏడాది డేటింగ్ చేసి వెంటనే చేప్పేసేది కాదని ఆమె చెప్పుకొచ్చింది. భరత్ అనే నేను వినయ విధేయ రామ చిత్రాలతో తెలుగులో సుపరిచితురాలైన ఈ సుందరి ప్రస్తుతం బాలీవుడ్‌లో బిజీగా ఉంది. గుడ్ న్యూస్, షేర్షా, కాంచన రీమేక్ లక్ష్మీ బాంబ్ చిత్రాల్లో నటిస్తోంది.

More Related Stories