English   

జాన్వీ కపూర్ సినిమాకు నెపోటిజమ్ సెగ.. బ్యాన్ చేయాలంటూ..

Jahnvi Kapoor
2020-08-01 17:37:55

సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం బాలీవుడ్ లో చాలా మంది హీరోలకు శాపంగా మారుతుంది. ఆయన చనిపోయిన తర్వాత నెపోటిజమ్‌ రచ్చ పెరిగిపోయింది. ముఖ్యంగా అక్కడ వారసుల సినిమాలు ఎవరూ చూడకూడదని ఫిక్సైపోయారు ఆడియన్స్. కరణ్ జోహార్ సహా మరో అరడజన్ మంది నిర్మాతలు నిర్మించే సినిమాలను చూడొద్దంటూ నెటిజన్స్ కూడా ట్రోల్ చేస్తున్నారు. ఇప్పుడు ఇదే జరుగుతుంది. నెపోటిజమ్ కు బలైపోతున్న తొలి సినిమాగా గుంజన్ సక్సేనా కనిపిస్తుంది. ఈమె నటిస్తున్న గుంజన్ సక్సేనా సినిమా ట్రైలర్ విడుదలైంది. ఇందులో కార్గిల్ వార్‌లో ఇండియా తరఫున పోరాడిన లైడీ పైలెట్‌ గుంజన్ సక్సేనాగా నటిస్తుంది జాన్వీ. ఈమె జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమాను శరణ్ శర్మ తెరకెక్కించాడు. కరణ్ జోహార్ ధర్మా ప్రొడక్షన్స్, జీ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మించారు.

తాజాగా విడుదలైన ఈ సినిమా ట్రైలర్ పర్లేదనిపిస్తుంది. ఆగస్ట్ 12న నెట్ ఫ్లిక్స్‌లో సినిమా విడుదల కానుంది. ఈ సినిమాలో ప్రముఖ నటుడు పంకజ్ త్రిపాఠి ఇందులో జాన్వీ తండ్రిగా నటించాడు. కూతురు వెన్నుతట్టి ప్రోత్సహించే తండ్రిగా ఆయన ఇందులో కనిపించాడు. అయితే ఈ సినిమాకు ఇప్పుడు నెపోటిజమ్ సెగ తగులుతుంది. కరణ్ జోహార్ పేరు చూడగానే ప్రేక్షకులు కూడా మండి పడుతున్నారు. అస్సలు టాలెంట్ లేని స్టార్ కిడ్స్‌ను ఇండస్ట్రీకి తీసుకొచ్చి నాశనం చేస్తున్నావ్ అంటూ ఆయనపై ఫైర్ అవుతున్నారు. ఈ క్రమంలోనే ఈయన నిర్మించిన గుంజన్ సక్సేనా సినిమాను చూడొద్దంటూ.. వెంటనే బాయ్‌కాట్ చేయాలంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున రచ్చ జరుగుతుంది. ఫేస్‌లో ఏ చిన్న ఎక్స్‌ప్రెషన్ కూడా లేకుండా ఉన్న జాన్వీ కపూర్ ఈ పాత్రకు అర్హురాలు కాదంటూ ట్వీట్స్ వేస్తున్నారు నెటిజన్లు. మొత్తానికి సుశాంత్ మరణం తాలూకు సెగ మొదటగా జాన్వీ సినిమాకు తగలబోతుంది. 

More Related Stories