కంగనా ఇంటి వద్ద కాల్పుల కలకలం..సుశాంత్ ఇష్యూలోనేనా

వివాదాస్పద బాలీవుడ్ నటి కంగనా రనౌత్ ఇంటి వద్ద కాల్పుల కలకలం రేగింది. వెంటనే అలర్ట్ అయిన ఆమె స్థానిక పోలీసులకు సమాచారమివ్వడంతో వారు భద్రత కల్పించినట్టు తెలుస్తోంది. కొంతకాలం క్రితం జరిగిన బాలీవుడ్ యువ నటుడు సుశాంత్ రాజ్పుత్ ఆత్మహత్య విషయం మీద కంగనా వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తోంది. ఈ క్రమంలోనే తనను భయపెట్టేందుకే ఈ కాల్పులు జరిపి ఉంటారని కంగనా చెబుతోంది. దీంతో జనాల్లో పలు అనుమానాలు రేకెత్తుతున్నాయి. హిమాచల్ ప్రదేశ్ మనాలీలోని తన సొంతింట్లో ఉండగా మొన్న రాత్రి పదకొండున్నరకు కాల్పుల శబ్దం వినిపించిగా వెంటనే ఆమె పోలీసులకు సమాచారం అందించారు. ఈ ఘటన మీద కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ జరుపుతున్నారు. కాల్పులు ఎవరు జరిపారన్న విషయం ఏమీ తెలియలేదు. అయితే పోలీసులు మాత్రం ఆపిల్ తోటల్లో గబ్బిలాలను భయపెట్టడానికి ఎవరైనా తుపాకీతో కాల్పులు జరిపి ఉంటారని అనుమానిస్తున్నారు. కానీ కంగనా మాత్రం ఎవరో కావాలనే తనను బెదిరించడానికి ప్రయత్నిస్తున్నారని చెబుతోంది.